కేసీఆర్ దేవాంతకుడు.. ఖమ్మంలోనే కేసీఆర్ బీఆర్ఎస్ సభ ఎందుకు పెట్టారంటే!!
తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ సెంటిమెంటుతో రాజకీయాలు మొదలు పెట్టిన బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ జాతీయ రాజకీయాలలో దూకుడుగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీని మార్పు చేస్తూ జాతీయ పార్టీగా ప్రకటించిన కేసీఆర్ ఖమ్మం వేదికగా బీఆర్ఎస్ ఆవిర్భావ సభను నిర్వహించనున్నారు. అయితే కేసీఆర్ ఖమ్మం కేంద్రంగా బీఆర్ఎస్ ఆవిర్భావ సభను ఎందుకు నిర్వహిస్తున్నారు? ఖమ్మం సభ వెనుక అయిన మాస్టర్ ప్లాన్ ఏంటి? కెసిఆర్ లక్ష్యం ఏంటి? అన్నది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ కారణంగా మారింది.

ఖమ్మం సభతోనూ సరిహద్దు రాష్ట్రాలపై ఫోకస్
తెలంగాణ సీఎం, గులాబీ బాస్ కేసీఆర్ ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ ను నిర్వహించడం ఆసక్తికర పరిణామం. ఇక ఈ బహిరంగ సభకు ఏకంగా ఐదు లక్షల మందిని జనసమీకరణ చేయాలని ఆదేశించిన కేసీఆర్, ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి 3 లక్షల మందిని జన సేకరణ చేయాలని సూచనలు చేశారు. సరిహద్దు రాష్ట్రాల బోర్డర్ జిల్లాల నుండి కూడా జన సమీకరణకు ప్లాన్ చేశారు.

ఖమ్మం సభతో ఏపీ, చత్తీస్ గడ్ లపై ఫోకస్ పెట్టిన కేసీఆర్
ముఖ్యంగా ఏపీ, చత్తీస్ గడ్ లపైన కూడా కేసీఆర్ ఫోకస్ పెట్టారు. అయితే కెసిఆర్ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ఖమ్మం జిల్లా నుండి మాత్రమే కాకుండా, ఏపీ సరిహద్దు ప్రాంతాల ప్రజలు, ఛత్తీస్ ఘడ్ సరిహద్దు ప్రాంతాల ప్రజలు కూడా ఆసక్తి చూపి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే కెసిఆర్ ఖమ్మంలో సభ పెట్టడం వ్యూహాత్మకమే అన్నది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఖమ్మం లో సభ పెట్టడం వల్ల తెలంగాణ ప్రజలను మాత్రమే కాకుండా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వారిని కూడా ఆకట్టుకునే అవకాశం ఉంది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు వారే కాకుండా ఖమ్మంలోని ఏజెన్సీ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న చత్తీస్గడ్ సరిహద్దు ప్రాంతాల ప్రజలను కూడా కెసిఆర్ తన సభ ద్వారా ఆకట్టుకోనున్నారు.

ఖమ్మం సభ ద్వారా కేసీఆర్ మాస్టర్ ప్లాన్
ఈ సభతో కెసిఆర్ మూడు రాష్ట్రాలను కవర్ చేయడానికి ప్లాన్ చేసినట్టు భావిస్తున్నారు. అంతేకాదు ఈ సభ ద్వారా బి ఆర్ ఎస్ విధివిధానాలను దేశానికి చెప్పనున్న కేసీఆర్ మూడు రాష్ట్రాలను కవర్ చేయనున్నారు. ఇక మరో నాలుగు రాష్ట్రాల సీఎంలను, ఇద్దరు మాజీ సీఎం లను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి ఆయా రాష్ట్రాల దృష్టిని కూడా ఆకర్షించనున్నారు. ఇతర రాష్ట్రాల్లో సభ పెడితే కేసీఆర్ అనుకున్న పర్పస్ పూర్తి కాదు. అందుకే ఖమ్మం కేంద్రంగా అజెండా ప్రకటన చెయ్యనున్నారు. విధి విధానాలను ప్రకటించి కార్య క్షేత్రంలోకి వెళ్లనున్నారు కేసీఆర్.

కేసీఆర్ ప్లాన్స్ ఊహకు అందవు
కెసిఆర్ ఖమ్మం సభను చాలామంది లోకల్ సభగా భావిస్తుంటే, ఖమ్మంలో సభ పెట్టడం వెనుక బోలెడన్ని కారణాలు, కెసిఆర్ మాస్టర్ మైండ్ వున్నాయని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆయా రాష్ట్రాలపై ఖమ్మం సభ ప్రభావం ఉంటుందని అంటున్నారు. ఏది ఏమైనా గులాబీ బాస్ కెసిఆర్ వ్యూహాలు రచించడంలో, ఊహించని పనులు చేయడంలో దేవాంతకుడు. మరి ఈ ఖమ్మం సభ ద్వారా కెసిఆర్ వేసిన ఎత్తుగడ ఏ మేరకు సత్ఫలితాలను ఇస్తుంది అన్నది వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications