కొత్త జిల్లాల ఏర్పాటు: గవర్నర్‌తో కేసీఆర్ భేటీ
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. గురువారం ఉదయం రాజ్ భవన్‌కు వెళ్లిన కేసీఆర్, గవర్నర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా, రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలపై గవర్నర్‌కు వివరాలను వెల్లడించారు. దీనికి ప్రతిస్పందనగా, కొత్త జిల్లాల ఏర్పాటు పాలనాపరంగా మంచి నిర్ణయమని కేసీఆర్‌ని గవర్నర్ ప్రశంసించారు. దీంతో పాటు సద్దుల బతుకమ్మ వేడుకలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. బతుకమ్మ వేడుకలకు తప్పకుండా హాజరవుతానని కేసీఆర్‌కు గవర్నర్ హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications