గవర్నర్‌తో గంటన్నర పాటు కెసిఆర్: ఓటుకు నోటు పైనే...

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సోమవారం గవర్నర్ నరసింహన్‌తో సమావేశం కావడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఓటుకు నోటు కేసు నేపథ్యంలో ఆయన గవర్నర్‌ను కలుసుకోవడంపై ఊహాగానాలు చేలరేగుతున్నాయి. గంటన్నర పాటు ఇరువురి మధ్య చర్చలు జరిగాయి.

ఓటుకు నోటు కేసు పరిణామాలను, దాని ప్రగతిని కెసిఆర్ గవర్నర్‌కు వివరించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం ఆలోచనను గవర్నర్ నరసింహన్ కెసిఆర్‌కు చెప్పినట్లు సమాచారం. నిరుడు ఏడాది పాటు హైదరాబాదులో శాంతిభద్రతలకు ఏ విధమైన విఘాతం కలుగలేదనే విషయాన్ని కెసిఆర్ గవర్నర్ దృష్టికి తెచ్చారని అంటున్నారు.

KCR meets governor on cash for vote case

హైదరాబాదులో సెక్షన్ 8ను అమలు చేయాల్సిన అవసరం లేదని కెసిఆర్ గవర్నర్‌తో చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. ఎపి, తెలంగాణ ప్రభుత్వాల అభిప్రాయాలను గవర్నర్ కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తారని అంటున్నారు.

కాగా, తెలంగాణ ప్రభుత్వం తమ ఫోన్ల ట్యాపింగ్‌కు పాల్పడుతోందని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ నాయకులు గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై కూడా ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+