ఏపీ వాడిన భవనాలు అప్పగించండి: గవర్నర్‌తో కేసీఆర్ కీలక భేటీ
హైదరాబాద్: కొత్తగా నిర్మించబోయే సచివాలయంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు సోమవారం రాజభవన్‌కు వెళ్లి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో ఈ అంశాన్ని చర్చించినట్టు అధికార వర్గాల సమాచారం.
ప్రస్తుత సచివాలయం స్థానంలోనే పాత భవనాలను కూల్చి కొత్త భవనం నిర్మించడానికి రెండు ప్రతిపాదనలను ముఖ్యమంత్రి గవర్నర్‌కు వివరించినట్టు తెలిసింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేటాయించిన కార్యాలయాలు ఇప్పటికే అమరావతికి తరలివెళ్లడంతో వాటిని అప్పగిస్తే వాటి స్థానంలో ప్రముఖ ఆర్కిటెక్క్ హఫీజ్ కాంట్రాక్టర్ తయారు చేసిన డిజైన్‌తో 'యు' ఆకారంలో రూ.350 కోట్లతో కొత్త భవనం నిర్మించడం ఒకటి.
అలా కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేటాయించిన భవనాలను అప్పగించడానికి విభజన చట్టంలో పది సంవత్సరాల గడువు ఉండటంతో తాత్కాలికంగా పది అంతస్తులతో రూ. 180 కోట్లతో కొత్త సచివాలయాన్ని నిర్మించడం రెండవ ప్రతిపాదన.

నిర్ణయం ఎలా ఉన్నా తెలంగాణ ప్రభుత్వానికి కేటాయించిన ఎ నుంచి డి బ్లాక్‌ల వరకు ఉన్న భవనాలను డిసెంబర్‌లో కూల్చివేసి కొత్త భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి కెసిఆర్ గవర్నర్‌కు వివరించినట్టు తెలిసింది.
అంతేగాక, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యామ్నాయ భవనాలు కేటాయిస్తామని ఈ సందర్భంగా కేసీఆర్.. గవర్నర్‌కు చెప్పారు. సచివాలయ నిర్మాణంతో పాటు ఇటీవల ప్రారంభమైన కొత్త జిల్లాల ఏర్పాటుపై గవర్నర్‌తో ముఖ్యమంత్రి చర్చించినట్టు తెలిసింది.












Click it and Unblock the Notifications