మునుగోడు ఉపఎన్నిక వేళ ఎమ్మెల్యేల కొనుగోళ్ళ రచ్చ; టీఆర్ఎస్ మైండ్‌గేమ్ తో డిఫెన్స్‌లో బీజేపీ
మునుగోడు ఉప ఎన్నికల సమయం దగ్గర పడటంతో పోటాపోటీగా అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ ఎన్నిక అన్ని రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా కావడంతో పెద్ద ఎత్తున తమ శ్రేణులను రంగంలోకి దింపి ప్రచారం చేస్తున్నాయి. ముఖ్యంగా అధికార టిఆర్ఎస్, కేంద్రంలోని అధికార బిజెపి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతుంది. ఇక ఈ సమయంలో బిజెపి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి మొయినాబాద్ ఫామ్ హౌస్ వేదికగా ప్రయత్నం చేసిందని టిఆర్ఎస్ పార్టీ ఆరోపించడం బిజెపి నేతలకు తలనొప్పిగా మారింది.

ఎమ్మెల్యేల కొనుగోళ్ళ ఆరోపణలతో డిఫెన్స్ లో పడిన బీజేపీ
ఇక ఈ వ్యవహారాన్ని బిజెపి అనేకమార్లు తిప్పి కొట్టే ప్రయత్నం చేసింది. ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారానికి కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా సీఎం కేసీఆర్ అని చెప్పే ప్రయత్నం చేసింది. ఇక బిజెపి నాయకులతో పట్టుబడిన స్వామీజీలు ఉన్న ఫోటోలను, వీడియోలను టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున షేర్ చేయడంతో ఆత్మ రక్షణలో పడిన బిజెపి, ఈ వ్యవహారంలో తాము లేమని చెప్పే ప్రయత్నం గట్టిగానే చేస్తుంది. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వారితో మాట్లాడిన సంభాషణలు, ఆరోజు ఫాంహౌస్ లో జరిగిన సంభాషణ అన్ని రికార్డింగ్స్ ఉన్నాయని టిఆర్ఎస్ పార్టీ చెప్పడంతో బిజెపి డిఫెన్స్ లో పడింది.

తమ సచ్చీలత నిరూపించుకోవటం కోసం కోర్టును ఆశ్రయించిన బీజేపీ
ఇక పోలీసుల వద్ద అన్ని ఆధారాలున్నాయని, విచారణలో బయటపడతాయని టిఆర్ఎస్ పార్టీ నేతలు మాట్లాడటంతో తెలంగాణ పోలీసులు, తెలంగాణ ప్రభుత్వ చెప్పుచేతల్లో పని చేస్తున్నారని అనుమానంతో బిజెపి మరో నిర్ణయం తీసుకుంది. ఇక తమ సచ్ఛీలతను నిరూపించుకోవడం కోసం బిజెపి కీలకమైన అడుగు వేసింది. ఈ కేసు పై బిజెపి నేతలు హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ పోలీసులు విచారణ జరుపుతున్నారు అని చెబుతున్న కేసును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ తో విచారణ జరిపించాలని బిజెపి నాయకులు హైకోర్టులో పిటిషన్ వేశారు. సిబిఐ, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు.

కెసిఆర్ తీసిన సినిమా అట్టర్ ఫ్లాప్ అంటూ బీజేపీ ఆగ్రహం
ఇక టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రచారం అంతా కట్టుకథ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మునుగోడు లో ఓటమి భయంతోనే టిఆర్ఎస్ కొత్త డ్రామాలకు తెర తీసిందని బిజెపి నాయకులు ఆరోపిస్తున్నారు. కెసిఆర్ తీసిన సినిమా అట్టర్ ఫ్లాప్ అంటూ మండి పడుతున్నారు. ఇక తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫాంహౌస్ వ్యవహారంతో తమకు సంబంధం లేదని, తాను యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా ప్రమాణం చేస్తానని సీఎం కేసీఆర్ కి దమ్ముంటే ఆయన కూడా రావాలంటూ ఛాలెంజ్ విసిరారు.

మునుగోడు నుండి బీజేపీని డైవర్ట్ చేస్తూ టీఆర్ఎస్ పాలిటిక్స్
తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ ఇష్యూ ని సీరియస్ గా తీసుకుని ఢిల్లీ వెళ్లి ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం పై బిజెపి తీరును ఎండగట్టడానికి రెడీ అయ్యారని సమాచారం. ఏది ఏమైనా మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని బిజెపి సర్వశక్తులు ఒడ్డుతున్న సమయంలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం బిజెపిని డిఫెన్స్ లో పడేసింది. మునుగోడు ఉప ఎన్నికల వ్యూహం నుండి కాస్త బిజెపి ని డైవర్ట్ చేసింది. మరి దీని ఇంపాక్ట్ మునుగోడు ఉప ఎన్నిక పై ఏ విధంగా ఉంటుందో వేచి చూడాలి. టీఆర్ఎస్ మైండ్ గేమ్ ఆడుతుందా? లేకా నిజం గానే బీజేపీ కొనుగోలుకు ప్రయత్నించిందా? అన్నది అందర్నీ ఆలోచించేలా చేస్తుంది.
-
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
మందు బాబులకు బిగ్ షాక్.. 2 రోజులు వైన్స్ బంద్.. -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications