ఇదే సరైన సమయం - కేసీఆర్ అనూహ్య నిర్ణయం..!!
తెలంగాణ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్.. టీచర్ నియోజక వర్గాల ఫలితాల తరువాత కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. ఇప్పుడు అయిదు స్థానాల కోసం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. సిట్టింగ్ సీటు కోల్పోవటంతో కాంగ్రెస్ లో అంతర్మధనం కొనసాగుతోంది. సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్తున్నారు. ఇదే సమయంలో మాజీ సీఎం కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు. పార్టీ ముఖ్యులతో కీలక భేటీ ఏర్పాటు చేసారు. ఈ సమావేశం లో కీలక నిర్ణయాల ప్రకటనకు కేసీఆర్ సమాయత్తం అయ్యారు.
పార్టీ నేతలతో భేటీ
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తిరిగి రాజకీయంగా యాక్టివ్ కావాలని డిసైడ్ అయ్యారు. ఈ నెల 12 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల వేళ పార్టీ నేతలతో కేసీఆర్ కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఇందులో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ ఎంపీలు, ముఖ్య నేతలకు పాల్గొనాల్సిందిగా సమాచారం ఇచ్చారు. ఇందులో పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై చర్చించి, కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా కేసీఆర్ ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రతికూల ఫలితాలు రావటంతో ప్రభుత్వం పైన పోరాటానికి ఇదే సరైన సమయంగా కేసీఆర్ భావిస్తున్నారు.

ఎమ్మెల్సీ బరిలో
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సభలో ప్రస్తుతం ఉన్న సంఖ్యా బలం ఆధారంగా కాంగ్రెస్ కు నాలుగు .. బీఆర్ఎస్ కు ఒక్క సీటు దక్కనుంది. అయితే, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేల అనర్హత పైన సుప్రీంలో విచారణ కీలక దశలో ఉంది. దీంతో.. రాజకీయంగా వారి పైన ఒత్తిడి పెంచేందుకు బీఆర్ఎస్ ఇద్దరు అభ్యర్ధులను పోటీలో నిలబెట్టే అంశం పరిశీలిస్తున్నట్లు సమాచారం. పార్టీ నుంచి ఒక బీసీ, ఒక ఎస్టీ అభ్యర్ధులను పోటీ చేయించాలనే ప్రతిపాదన పైన ఈ రోజు సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఒకరినే పోటీకి దింపితే దాసోజ్ శ్రావణ్ పేరు ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. పార్టీమారిన ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో వ్యూహంపైనా కేసీఆర్ స్పందించే అవకాశం ఉంది.
కీలక నిర్ణయాలు
తాజాగా పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంతో తాను ఇక అందుబాటులో ఉంటానని కేసీఆర్ ప్రకటించారు. బీఆర్ఎస్ ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తవుతున్న వేళ వరుస కార్యక్రమాలకు పార్టీ సమాయత్తం అవుతోంది. ఈ రోజు జరిగే సమావేశంలో పార్టీ తరఫున భారీ బహిరంగ సభను ఎక్కడ.. ఎప్పుడు నిర్వహించాలన్న విషయంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక, అసెంబ్లీ సమావే శాల్లో బడ్జెట్ రోజున కేసీఆర్ సభకు హాజరు కానున్నట్లు సమాచారం. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నారు. కేసీఆర్ తాను కూడా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీంతో, ఈ రోజు జరిగే సమావేశంలో కేసీఆర్ ఎలాంటి నిర్ణయాలు ప్రకటిస్తారనేది రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది.












Click it and Unblock the Notifications