Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టీఆర్ఎస్ లేదిక -బీఆర్ఎస్ ఆవిర్భావం : సీఎం కేసీఆర్ ఎమోషనల్..!

తెలుగు గడ్డ మరో రాజకీయ సంచలనానికి వేదికైంది. తెలుగు రాష్ట్రంలో మరో జాతీయ పార్టీ ఆవిర్భవించింది. కొద్ది నెలలుగా జరుగుతున్న ప్రచారం వాస్తవంలోకి వచ్చింది. తెలంగాణ ఉద్యమ పార్టీగా నాడు టీఆర్ఎస్ స్థాపించిన కేసీఆర్..నేడు జాతీయ రాజకీయాలే లక్ష్యంగా తన ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీగా మార్చేసారు. తెలంగాణ రాష్ట్ర సీఎంగా ఉన్న కేసీఆర్ ఇప్పుడు జాతీయ నేతగా మారుతున్నారు. సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న కేసీఆర్ రాజకీయంగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. ముందు నుంచి పక్కా లెక్కతో జాతీయ పార్టీగా టీఆర్ఎస్ ను మార్చటం పైన ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసుకున్నారు. దీంతో ఇప్పటి వరకు టీఆర్ఎస్ ఇక నుంచి బీఆర్ఎస్ గా మారింది.

ఏకగ్రీవ తీర్మానం ఆమోదం

ఏకగ్రీవ తీర్మానం ఆమోదం


జాతీయ పార్టీకి సంబంధించి పార్టీ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది. తెలంగాణ ముద్దాడటమే లక్ష్యంగా 2001 లో టీఆర్ఎస్ ఏర్పాటు చేసారు. అనేక ఒడిదుడికులతో పార్టీని కొనసాగించిన కేసీఆర్..2014లో తన లక్ష్యాన్ని చేరుకున్నారు. ఇక, ఏడాది కాలంగా జాతీయ రాజకీయాల పైన ఫోకస్ చేసారు. జాతీయ స్థాయిలో అనేక పార్టీల నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహించారు. రైతు సమస్యల పైన ఎక్కువగా చర్చించారు. రైతు నేతలను హైదరాబాద్ ఆహ్వానించారు. అనేక మంది మేధావులతోనూ దేశంలోని పరిస్థితుల పైన చర్చలు చేసారు. తన లక్ష్యం..తన ముందున్న విజన్ ఆవిష్కరించారు. అందరి ఆమోదం తీసుకున్నారు. అందరూ కేసీఆర్ ఎంచుకున్న మార్గాన్ని అభినందించారు. మద్దతు ప్రకటించారు. అందులో భాగంగానే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చుతూ తీసుకుంటున్న నిర్ణయం వేళ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామితో పాటుగా తమిళనాడు నేతలు హాజరయ్యారు.

సరిగ్గా అనుకున్న ముహూర్తానికే..

సరిగ్గా అనుకున్న ముహూర్తానికే..


ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తాను ఎందుకు జాతీయ రాజకీయాల వైపు చూస్తుందీ వివరించారు. టీఆర్ఎస్ బాధ్యత ఏంటో స్పష్టం చేసారు. తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాల్సిన అవసరం.. తెలంగాణ బిడ్డగా ఉన్న బాధ్యతలను వివరించారు. ఈ సమయంలో అనుకున్న ముహూర్తానికే తీర్మానం ప్రవేశ పెట్టటం..ఆమోదించటం పూర్తయింది. అందరి హర్ష ద్వానాల మధ్య సీఎం కేసీఆర్ తన పార్టీ ఇక నుంచి బీఆర్ఎస్ గా రూపాంతంరం చెందుతున్నట్లుగా ప్రకటించారు. సరిగ్గా 1.19 గంటలకు కేసీఆర్ ఈ ప్రకటన చేసారు. ఇక, పార్టీ నిర్మాణానికి సంబంధించిన కార్యచరణ సిద్దం చేసారు. రేపు ఎన్నికల సంఘం ముందు పార్టీ నేతలు తమ పార్టీకి జాతీయ పార్టీగా గుర్తింపు కోసం దరఖాస్తు చేయనున్నారు. ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం సిద్దమైంది.

ఉద్వేగానికి లోనైన సీఎం కేసీఆర్

ఉద్వేగానికి లోనైన సీఎం కేసీఆర్


తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడి హోదాలో కేసీఆర్ తన పార్టీ పేరు ఇక భారతీయ రాష్ట్ర సమితిగా ప్రకటించారు. జాతీయ నేతలు - పార్టీ నేతల సమక్షంలో కేసీఆర్ అధికారికంగా ఈ ప్రకటన చేసారు. ముందు నుంచి సిద్దం చేసుకున్న ప్రణాళిక మేరకు కేసీఆర్ ఈ విస్పష్ట ప్రకటన చేసారు. జాతీయ రాజకీయాల్లో ప్రత్యేక అజెండాతో ముందుకు వెళ్తామని కేసీఆర్ స్పష్టం చేసారు. టీఆర్ఎస్ కష్ట నష్టాల్లో అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు చెప్పిన కేసీఆర్..ఇప్పుడు బీఆర్ఎస్ భవిష్యత్ కు సహకారం అందించాలని కోరారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమోషనల్ అయినట్లు పార్టీ నేతలు చెప్పారు. ఇక, తన పార్టీ లక్ష్యాలను సీఎం కేసీఆర్ ప్రకటించనున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+