ఆ నేతకు విందు ఇచ్చి ‘పదవి కావాలా?’ అని అడిగిన కేసీఆర్!

భువనగిరి: రెండ్రోజుల క్రితం యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్న అనంతరం భువనగిరికి చెందిన టిఆర్ఎస్ పార్టీ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్ ఎలిమినేటి కృష్ణారెడ్డి నివాసానికి వెళ్లారు ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావు.

కృష్ణారెడ్డి నివాసంలోనే సుమారు 30 నిమిషాల పాటు గడిపి వారి కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో మరుసటిరోజు మధ్యాహ్నం తనతో భోజనానికి రావాలని ఆయన కృష్ణారెడ్డిని ఆహ్వానించారు.

KCR offer to Krishna Reddy

దీంతో కృష్ణారెడ్డి తన కుమారుడు వివేక్‌ రెడ్డితో కలిసి మంత్రి జగదీశ్‌ రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌ రెడ్డితో కలిసి గురువారం మధ్యాహ్నం భోజనానికి సీఎం క్యాంప్‌ కార్యాలయానికి వెళ్లారు.

ఈ సందర్భంగా కేసీఆర్ తెలంగాణ ఉద్యమం తొలి రోజులను గుర్తుచేసుకున్నారు.అంతేగాక, 'కృష్ణన్నా! మొదటినుంచి నాతో పాటు పనిచేశావ్‌.. ఏదైనా పదవి కావాలా ?' అని కేసీఆర్.. కృష్ణారెడ్డిని అడగడం అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. కేసీఆర్ ఆఫర్‌కు స్పందించిన కృష్ణా రెడ్డి..'మీ ఇష్టం. మీరు ఏది ఇచ్చినా తీసుకుంటా' అని సమాధానం ఇచ్చినట్టు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+