హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బుద్ధవనంలో కేసీఆర్, సాగర్‌లో స్పీకర్(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బుద్ధ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని సోమవారం ఉదయం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాగార్జున సాగర్‌లో జరిగిన బుద్ధపూర్ణిమ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగార్జున సాగర్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దృష్టి పెట్టారు.

సోమవారం నాగార్జునసాగర్ దాని పరిసర ప్రాంతాలను పరిశీలించారు. నాగార్జున సాగర్‌ను అంతర్జాతీయ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దే అంశాలపై అధికారులతో చర్చించారు. కాలినడనక కొంత ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన ఆ తర్వాత హెలికాప్టర్‌లో విహంగవీక్షణం జరిపారు.

బుద్ధవనంలో కేసీఆర్, మొక్క నాటారు

బుద్ధవనంలో కేసీఆర్, మొక్క నాటారు

సాగర్ డ్యాం, బుద్ధవనం, సిద్దార్థ హోటల్, లాంచీ కేంద్రం ఇలా ఈ ప్రాంతంలో అంతటా కలియదిరిగారు. అభివృద్ధికి ఉన్న దాదాపు అన్ని అవకాశాలను సమీక్షించారు. ఇక్కడ ఉన్న బుద్ధవనం కేంద్రంగా పర్యాటక క్షేత్రం అభివృద్ధి చేయాలని అభిప్రాయపడ్డారు.

 బుద్ధవనంలో కేసీఆర్, మొక్క నాటారు

బుద్ధవనంలో కేసీఆర్, మొక్క నాటారు

పర్యాటకులకు వసతులు కల్పించడంతోపాటు ఇంకా ఎక్కువ సంఖ్యలో అతిథి గృహాలు, కాటేజీలు నిర్మించాల్సి ఉందని అధికారులకు సీఎం చెప్పారు. బుద్ధవనంలో జరిగిన బుద్ధపూర్ణిమ ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన ఆ ప్రాంతమంతా కలియ తిరిగి అక్కడి నిర్మాణాలను పరిశీలించారు.

 బుద్ధవనంలో కేసీఆర్, మొక్క నాటారు

బుద్ధవనంలో కేసీఆర్, మొక్క నాటారు

అనంతరం ఉదయం పదకొండు గంటలకు నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు, విద్యుత్ శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి, పరిశ్రమలు, చేనేత శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి హెలిక్యాప్టర్‌లో నల్లగొండ జిల్లాలోని ప్రాజెక్టుల విహంగవీక్షణం జరిపారు. బుద్ధపూర్ణిమలో ఉన్న 270 ఎకరాల వనంలోని కిందిభాగాన్ని ఏరియల్ సర్వే చేశారు.

 బుద్ధవనంలో కేసీఆర్, మొక్క నాటారు

బుద్ధవనంలో కేసీఆర్, మొక్క నాటారు

సిద్ధార్ధ హోటల్ కింది భాగంలో ఉన్న ప్రాంతాన్ని కూడా చూశారు. బుద్ధపూర్ణిమ ప్రాజెక్టుకు అవసరమైతే కృష్ణా నది తీరంలో ఉన్న అటవీ ప్రాంతాన్ని కూడా జోడించి అభివృద్ధి చేయాలనే అభిప్రాయాన్ని సీఎం వ్యక్తపరిచారు. తర్వాత సాగర్ డ్యాంను పరిశీలించిన ముఖ్యమంత్రి, కొత్తగా ఏర్పాటు చేసిన లాంచీ కేంద్రాన్ని పరిశీలించారు.

 బుద్ధవనంలో కేసీఆర్, మొక్క నాటారు

బుద్ధవనంలో కేసీఆర్, మొక్క నాటారు

సాగర్ డ్యాం పరిశీలన అనంతరం సీఎం బృందం అక్కడికి దిగువన 15 కిలోమీటర్ల వరకు హెలికాప్టర్‌లో సర్వే జరిపారు. పులిచింతల తరహాలో తెలంగాణకు లబ్ధి చేకూరేలా ఒక నీటి నిల్వ ప్రాజెక్టు నిర్మించే ప్రతిపాదన ఒకటి ఈ సందర్భంగా వచ్చింది.

 బుద్ధవనంలో కేసీఆర్, మొక్క నాటారు

బుద్ధవనంలో కేసీఆర్, మొక్క నాటారు

ఆ దిశగా ఏమేరకు అవకాశం ఉందనే విషయాన్ని సర్వేలో పరిశీలించినట్లు సమాచారం. అనంతరం నక్కలగండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించనున్న లోయర్ డిండి ప్రాంతాన్ని సీఎం పరిశీలించారు. మహబూబ్‌నగర్ జిల్లా పరిధి అచ్చంపేట మండలంలోని మన్నెవారిపల్లి వరకు ఏరియల్ సర్వే కొనసాగింది.

 బుద్ధవనంలో కేసీఆర్, మొక్క నాటారు

బుద్ధవనంలో కేసీఆర్, మొక్క నాటారు

సాగర్ ఎడమ కాల్వ, లోలెవల్ (వరద కాల్వలు) కెనాల్స్‌ను కూడా పరిశీలించారు. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు, పుట్టంగండి వద్ద పంపింగ్ స్టేషన్, సిస్టర్న్, ఇతర నిర్మాణాలను చూశారు. ఆ సమీపంలో గుట్టలపై ఉన్న పెద్దగట్టు, బూడిదగట్టు, పావురాలగట్టు నివాస ప్రాంతాల అభివృద్ధిపై కూడా కొంత చర్చ జరిగింది.

 బుద్ధవనంలో కేసీఆర్, మొక్క నాటారు

బుద్ధవనంలో కేసీఆర్, మొక్క నాటారు

వచ్చే 15-20 రోజుల్లో నక్కలగండి ఎత్తిపోతల పథకం పనులకు శంకుస్థాపన చేద్దామని ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులతో అన్నట్లు తెలిసింది.

 హుస్సేన్ సాగర్‌లో ఘనంగా బుద్ధ జయంతి

హుస్సేన్ సాగర్‌లో ఘనంగా బుద్ధ జయంతి

బుద్ధ జయంతి ఉత్సవాలు సోమవారం నగరంలో ఘనంగా జరిగాయి. హస్సేన్ సాగర్‌లోని బుధ్దుడి విగ్రహం వద్ద జరిగిన ఉత్సవాల్లో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనా చారి హాజరయ్యారు.

హుస్సేన్ సాగర్‌లో ఘనంగా బుద్ధ జయంతి

హుస్సేన్ సాగర్‌లో ఘనంగా బుద్ధ జయంతి

బుద్ధుడి బోధనలు, సూక్తుల్ని ఆకలింపు చేసుకుంటే గొప్ప సమాజాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని ఈ సందర్భంగా కొందరు తెలిపారు.

 హుస్సేన్ సాగర్‌లో ఘనంగా బుద్ధ జయంతి

హుస్సేన్ సాగర్‌లో ఘనంగా బుద్ధ జయంతి

తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పబ్లిక్ గార్డెన్స్ లోని పురావస్తు ప్రదర్శన శాల బుద్ధ గ్యాలరీ బౌధ్ద భిక్షవులు ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. అంతక ముందు 'గోమ్' వాద్యాన్ని పలికిస్తూ ఊరేగింపుగా వచ్చారు.

English summary
KCR participated in various programmes at Nagarjuna Sagar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X