• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జగన్‌ ముందు కేసీఆర్ ప్రతిపాదనలు..!ప్రజా సంక్షేమం కోసం దేనికైనా సిద్దమన్న ఏపి సీఎం..!!

|

హైదరాబాద్: విభజన తర్వాత ఏర్పడ్డ ఘర్షణ పూరిత వాతవరణానికి పూర్తి స్ధాయిలో చెక్ పెడుతున్నారు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. ప్రగతిభవన్లో రెండు రాష్ట్రాల సీఎంలు చంద్రశేఖర్ రావు, జగన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను సంపూర్ణంగా వినియోగించుకోవాలని సీఎంలు నిర్ణయానికి వచ్చారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతీ మూలకు నీరందించే విషయంలో కలిసి ముందుకు సాగుతామని ముఖ్యమంత్రులు చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు పచ్చగా ఉండాలని, వ్యవసాయానికి, తాగునీటికి, పరిశ్రమలకు నీటి కొరత రాకుండా చూడాలని ఆకాంక్షిస్తున్నారు.

  సిద్దిపేట జిల్లాలో కుప్పకూలిన ఎయిర్ క్రాఫ్ట్ .. ఇద్దరికి గాయాలు
   కేసీఆర్, జగన్ భేటీ..! సామరస్య వాతావరణంలో చర్చలు..!!

  కేసీఆర్, జగన్ భేటీ..! సామరస్య వాతావరణంలో చర్చలు..!!

  అయితే ఈ సమావేశంలో ఏపీ ప్రభుత్వం ముందు తెలంగాణ ప్రభుత్వం కొన్ని పతిపాదనలు ఉంచింది. గోదావరి ఎత్తిపోతల నీటి పథకంలో తెలంగాణ ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనలు చేసింది. గోదావరి జలాలను దుమ్ముగూడ నుంచి నాగార్జునసాగర్‌లోకి ఆ తర్వాత శ్రీశైలం జలాశయంలోకి 90 రోజుల పాటు 450 టీఎంసీల వరకు ఎత్తిపోయాలని రెండు ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఆ తర్వాత ప్రాణహిత నుంచి గోదావరి జలాలను సాగర్‌కు ఎత్తిపోసి అక్కడి నుంచి శ్రీశైలానికి తరలిస్తారు. ఇంద్రావతి వద్ద గోదావరి జలాలను ఎత్తిపోసి శ్రీశైలం నింపడం వంటి ప్రతిపాదనలు ఇందులో ఉన్నాయి. ఇవన్నీ తెలంగాణ భూభాగం నుంచి వెళ్తాయి.

  వీడుతున్న చిక్కు ముడులు..! పరస్పర అవగాహనలో చర్చలు..!!

  వీడుతున్న చిక్కు ముడులు..! పరస్పర అవగాహనలో చర్చలు..!!

  ఈ సమావేశానికి ఏపీ నుంచి సీఎం జగన్‌తో పాటు ఆరుగురు మంత్రులు హాజరయ్యారు. చంద్రశేఖర్ రావుతో పాటు తెలంగాణ తరపున నలుగురు మంత్రులు హాజరయ్యారు. గోదావరి నీటిని, కృష్ణా నదికి మళ్లించడమే ప్రధాన అజెండా ఇరు రాష్ట్రాల సీఎంలు పెట్టుకున్నారు. సాయంత్రం వరకు రెండు రాష్ట్రాల సీఎంల సమావేశం కొనసాగనుంది. నదీ జలాల వినియోగంపై గతంలో ఉన్న వివాదాలను మరిచిపోయి.. రెండు రాష్ట్రాలకు మేలు చేసే విషయంలో ఏకాభిప్రాయంతో ఉండాలని అనుకుంటున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండూ వేర్వేరు అనే భావన తమకు లేదని, రెండు రాష్ట్రాల ప్రజలు బాగుండాలన్నదే తమ అభిమతమని ముఖ్యమంత్రులు పేర్కొంటున్నారు.

  జగన్ పెద్ద మనసుతో వ్యవహరించారు..! ముగడ్తలతో ముంచెత్తిన కేసీఆర్..!!

  జగన్ పెద్ద మనసుతో వ్యవహరించారు..! ముగడ్తలతో ముంచెత్తిన కేసీఆర్..!!

  ఏపీ సీఎం జగన్‌పై తెలంగాణ సీఎంచంద్రశేఖర్ రావు మరోసారి ప్రసంశలు కురిపించారు. జగన్ స్వచ్ఛమైన హృదయంతో వ్యవహరించారని కొనియాడారు. ప్రతిగభవన్‌లో రెండు రాష్ట్రాల సీఎంలు సమావేశమయ్యారు. విభజన తర్వాత తెలుగు రాష్ట్రాలు మధ్య పెండింగ్‌లో ఉన్న సమస్యలపై సీఎంలు కేసీఆర్, జగన్ దృష్టి సారించారు. 'రెండు రాష్ట్రాలు.. రెండు నదులు' అనే నినాదంతో గోదావరి, కృష్ణా నదీ జలాలను సంపూర్ణంగా వినియోగించుకోవాలని భావిస్తున్నారు. అందులోభాగంలో ప్రగతిభవన్లో రెండు రాష్ట్రాల సీఎంలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను సంపూర్ణంగా వినియోగించుకోవాలని సీఎంలు నిర్ణయానికి వచ్చారు. సీఎంల సమావేశం శుక్రవారం సాయంత్రం వరకు కొనసాగుతుంది.

   సమస్యలు కొలిక్కి వచ్చినట్టే..! స్నేహ పూర్వకవాతావరణంలో ఇరు రాష్ట్రాలు..!!

  సమస్యలు కొలిక్కి వచ్చినట్టే..! స్నేహ పూర్వకవాతావరణంలో ఇరు రాష్ట్రాలు..!!

  భోజన విరామంలో చంద్రశేఖర్ రావు మీడియాతో మాట్లాడుతూ 'మా ఇద్దరి మధ్య బేషజాలు లేవు. బేసిన్ల గొడవ లేదు. అపోహలు లేవు. వివాదాలు అక్కర్లేదు. వివాదాలే కావాలనుకుంటే మరో తరానికి కూడా మనం నీళ్ళివ్వలేం. రెండు రాష్ట్రాలు కలిసి నడిస్తేనే ప్రగతి సాధిస్తాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంబంధాల్లో గుణాత్మక మార్పు వస్తుంది. రెండు రాష్ట్రాల ప్రజలు మనవారే అనే భావనతో ముందుకెళ్తాం. జగన్ స్వచ్ఛమైన హృదయంతో వ్యవహరించారు. కలిసి నడుద్దామనుకున్నాం. మహారాష్ట్రతో సయోధ్య ద్వారా కాళేశ్వరం నిర్మించుకోగలిగాం. రెండు రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలుంటే ప్రజలకు మేలు జరుగుతుంది. ప్రజలకు ఎంత వీలయితే అంత మేలు చేయడమే మా లక్ష్యం' అని చంద్రశేఖర్ రావు చెప్పారు.

  English summary
  The Chief Ministers of the Telugu states are doing a thorough check on the frictionless atmosphere created after bifurcation. Chandrashekhar Rao and Jagan met the CMs of the two states in Pragatibhavan. Several key decisions were made at this meeting. CMs have decided to make full use of the available water resources.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X