వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీలో కేసీఆర్ రాజశ్యామల యాగం ప్రారంభం... యాగం వెనుక ప్రధాన ఉద్దేశం ఇదేనా!!

|
Google Oneindia TeluguNews

దేశ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటుచేసిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ వేదికగా రాజ శ్యామల యాగానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు. వారం రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్న కేసీఆర్ తమ పార్టీ జాతీయ విధానాన్ని ప్రకటించడంతో పాటు, ఇతర రాష్ట్రాల నుండి కలిసొచ్చే పార్టీలతో మంతనాలు జరుపనున్నారు.

ఢిల్లీ వేదికగా కేసీఆర్ రాజశ్యామల యాగం

ఢిల్లీ వేదికగా కేసీఆర్ రాజశ్యామల యాగం


ఇదిలా ఉంటే తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ వేదికగా రాజ శ్యామల యాగం చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కెసిఆర్ ఇప్పటికే అనేక పర్యాయాలు అనేక యాగాలు చేశారు. గత ఎన్నికలకు ముందు ఫామ్హౌస్లో రాజ శ్యామల యాగం చేసిన కేసీఆర్, ఎన్నికల విజయం తరువాత సహస్ర చండీ యాగం చేశారు. ఇప్పుడు బి ఆర్ ఎస్ జాతీయ రాజకీయాల్లో అడుగుపెడుతున్న క్రమంలో మళ్లీ రాజ శ్యామల యాగం చేస్తున్నారు కేసీఆర్. సీఎం కేసీఆర్ ఏ పని చేసినా సరే యజ్ఞాలు, యాగాల సెంటిమెంట్ కనిపిస్తుంది. అది ఆయనకు కలిసొస్తుంది.

12 మంది రుత్విక్కులతో నేడు రేపు రాజశ్యామల యాగం జరుగుతుందిలా

12 మంది రుత్విక్కులతో నేడు రేపు రాజశ్యామల యాగం జరుగుతుందిలా


రాజశ్యామల యాగం కోసం ఇప్పటికే ప్రత్యేకంగా యాగశాలని నిర్మించారు. ఇక యాగానికి కావలసిన అన్ని ఏర్పాట్లను బీఆర్ఎస్ నేతలు పూర్తి చేశారు. దేశం సుభిక్షంగా ఉండాలని, బీఆర్ఎస్ పార్టీ విజయవంతంగా ముందుకు వెళ్లాలని ఆకాంక్షిస్తూ సీఎం కేసీఆర్ ఈ యాగాన్ని నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఇక ముఖ్యమంత్రి కెసిఆర్ ఢిల్లీలో నిర్వహిస్తున్న రాజ శ్యామల యాగం ప్రారంభమైంది. ఉదయం 9 గంటలకు 12 మంది రుత్వికులు ఢిల్లీలో రాజ శ్యామల యాగం గణపతి పూజతో ప్రారంభించారు. ఆపై పుణ్యాహవచనం, యాగశాల ప్రవేశం, చండీ పారాయణం, మూల మంత్ర జపాలతో రాజ శ్యామల యాగ నిర్వహణ కార్యక్రమాలు కొనసాగనున్నాయి.

జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ కీలకంగా మారటానికి దైవ కృప కావాలని యాగం

జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ కీలకంగా మారటానికి దైవ కృప కావాలని యాగం


నేడు, రేపు రెండు రోజుల పాటు జరగనున్న ఈ యాగంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కూడా పాల్గొననున్నారు. బుధవారం నాడు రేపు నవ చండీ యాగం, రాజశ్యామల హోమం నిర్వహించి ఆపై పూర్ణాహుతి ఇవ్వనున్నారు. శృంగేరి పీఠం గోపికృష్ణ శర్మ, ఫణి శశాంక శర్మ ఆధ్వర్యంలో ప్రస్తుతం రాజ శ్యామల యాగం కొనసాగుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ పని చేసినా దైవ కృప ఉండాలని బలంగా విశ్వసిస్తారు కాబట్టే ఆయన యజ్ఞాలకు, యాగాలకు ప్రాధాన్యతనిస్తారు. ఇక ఈ క్రమంలోనే ఆయన బీఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారాలని ఢిల్లీ వేదికగా రాజ శ్యామల యాగం నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే రేపు ఢిల్లీలోని బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. తమ పార్టీ జాతీయ విధానాన్ని ప్రకటించి, జాతీయ కార్యవర్గ సభ్యులను ప్రకటిస్తారు.

English summary
KCR Rajshyamala Yagam has started in Delhi. It is said that the intention is that the country should be well-off and the BRS party should move forward successfully in this yagam which will be held for two days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X