చీల్చి చెండాడుతాం -కేసీఆర్ హెచ్చరిక..!!
తెలంగాణ ప్రభుత్వానికి మాజీ సీఎం కేసీఆర్ హెచ్చరిక చేసారు. ఆర్దిక మంత్రి భట్టి అసెంబ్లీలో ఈ రోజు బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు. ఎన్నికల్లో పరాజయం తరువాత ప్రతిపక్ష నేతగా కేసీఆర్ తొలి సారి అసెంబ్లీకి హాజరయ్యారు. బడ్జెట్ పైన స్పందించారు. బడ్జెట్ లో కొత్తదనం లేదని చెప్పుకొచ్చారు. ఏ ఒక్క విషయంలోనూ ప్రభుత్వం పాలసీనే ఖరారు చేయలేదన్నారు. ఈ బడ్జెట్ పై ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతామని పేర్కొన్నారు.
కేసీఆర్ కామెంట్స్
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేసారు. తెలంగాణకు హాజరైన కేసీఆర్ బడ్జెట్ తరువాత కీలక వ్యాఖ్యలు చేసారు. గత ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాల కోసం సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందని చెప్పుకొచ్చారు. ఈబడ్జెట్ లో ఒక్క పథకంపైనా క్లారిటీ లేదని వివరించారు. ఈ బడ్జెట్ ప్రజల ఆశలపై నీళ్లు చల్లిందని వ్యాఖ్యానించారు. రైతులను పొడిగినట్లే పొగిడి వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు. దళిత బంధు అమలు చేయకుండా దళిత వర్గాన్ని మోసం చేసిందని కేసీఆర్ ఆరోపించారు.

భరోసా లేకుండా
ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఏ వర్గానికి భరోసాలేదన్నారు. ఆర్దిక మంత్రి ఒత్తి ఒత్తి చెప్పటం మినహా కొత్తగా ఏమీ లేదని దుయ్యబట్టారు. ఏ ఒక్క కొత్త సంక్షేమ పథకం లేదన్నారు. ఉన్న పథకాల గురించే గొప్పగా చెప్పుకొనే ప్రయత్నం జరిగిందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన వారికి ఆరు నెలల సమయం ఇవ్వాలనుకున్నామని కేసీఆర్ చెప్పారు. ఈ బడ్జెట్ చూస్తే ఏ ఒక్క విషయంలో ఈ ప్రభుత్వం పాలసీనే ఖరారు చేయలేదని పేర్కొన్నారు. తాము రైతుబంధు రెండు పంటలకు ఇచ్చామని కేసీఆర్ చెప్పారు. రైతులకు విత్తనాలు, నీరు కూడా ఇవ్వటం లేదని ఆరోపించారు.
ప్రభుత్వాన్ని నిలదీస్తాం
బడ్జెట్ లో రైతు బంధు, భరోసా ప్రస్తావనే లేదని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పాటై ఇన్ని నెలలు అవుతున్నా ఇండస్ట్రియల్ పాలసీ లేదని.. కధలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఏ వర్గానికి భరోసా దక్కలేదన్నారు. మహిళలకు ఇచ్చిన హామీల ప్రస్తావన లేదన్నారు. బడ్జెట్ వాస్తవానికి దూరంగా ఉందని..కొత్తదనం లేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. రైతుబంధు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని... రైతు శత్రు ప్రభుత్వంగా మారిందని కేసీఆర్ విమర్శించారు.












Click it and Unblock the Notifications