వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పట్టు వదలకుండా 2024ఎన్నికలకు కేసీఆర్ రోడ్ మ్యాప్; థర్డ్ ఫ్రంట్ ఏర్పాటులో కీలక పార్టీలివే!!

|
Google Oneindia TeluguNews

2024 లోక్‌సభ ఎన్నికలకు రోడ్ మ్యాప్ సిద్ధమవుతుందా? కెసిఆర్ అదే పనిలో బిజీగా ఉన్నారా? ఆప్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీలతో కలిసి కేసీఆర్ మూడో ఫ్రంట్ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. ప్రత్యామ్నాయ ఫ్రంట్ కు ప్రయత్నాలు చేస్తున్న కెసిఆర్ రెండు మూడు నెలల్లో దేశంలో సంచలనం సృష్టించబోతున్నామని చెబుతున్న వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే కేసీఆర్ ప్రయత్నాలు ఏ మేరకు సఫలమవుతాయి అన్నది తెలియాల్సి ఉంది.

కెసీఆర్ థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాలు... 2024 లోక్ సభ ఎన్నికలకు రోడ్ మ్యాప్

కెసీఆర్ థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాలు... 2024 లోక్ సభ ఎన్నికలకు రోడ్ మ్యాప్


తెలంగాణ సీఎం కేసీఆర్ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్నారు. 2024 లోక్ సభ ఎన్నికలకు రోడ్ మ్యాప్ రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తో కెసీఆర్ భేటీ నిర్వహించారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ను కలిసి దేశ రాజకీయాలపై కీలక చర్చ జరిపారు. కేసీఆర్ తో భేటీ అయిన అరవింద్ కేజ్రీవాల్ కేజ్రీవాల్ తో కలిసి రాజకీయంగా ముందుకు సాగే ఆలోచనలో లేనప్పటికీ, కేసీఆర్ ప్రతిపాదనపై అలోచనలో ఉన్నట్టు సమాచారం . ఇక తాజాగా మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డి కుమారస్వామి ల తో చర్చలు జరిపిన కెసిఆర్ థర్డ్ ఫ్రంట్ ప్రతిపాదన చేసినట్టుగా సమాచారం.

కేసీఆర్ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించిన కుమారస్వామి

కేసీఆర్ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించిన కుమారస్వామి

క్లోజ్డ్ డోర్ మీటింగ్‌లో రాష్ట్రపతి ఎన్నికలు కూడా చర్చలకు వచ్చాయని, ఈ సమయంలో ప్రత్యామ్నాయ శక్తికి నాయకత్వం వహించాలని కెసిఆర్ దేవెగౌడను కోరినట్లు సమాచారం. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం జూలైలో ముగియనున్నందున రాష్ట్రపతి ఎన్నికలకు అభ్యర్థిత్వాన్ని కూడా ఆయన సూచించినట్లు సమాచారం. ఇక హెచ్డీ దేవెగౌడ సీఎం కెసీఆర్ ప్రతిపాదనపై సానుకూలంగా ఉన్నట్టు ఆయన చేసిన వ్యాఖ్యలతో అర్ధం అవుతుంది. మరో రెండు మూడు నెలల్లో మేం మీకు శుభవార్త అందిస్తాం'' అని కుమారస్వామి అన్నారు. ప్రాంతీయ పార్టీలు పెరిగిపోతున్నాయని, బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కటి మాత్రమే ముందుకొస్తున్నదని పేర్కొన్న ఆయన, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ప్రాంతీయ పార్టీలన్నీ తమ విభేదాలను విడనాడి "ఉమ్మడి వేదిక"కి రావాలని పిలుపునిచ్చారు.

జాతీయ రాజకీయాలపై కేసీఆర్ ప్లాన్.. పట్టు వదలకుండా

జాతీయ రాజకీయాలపై కేసీఆర్ ప్లాన్.. పట్టు వదలకుండా


జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి ఉత్సాహంగా దేశ పర్యటన ను ప్రారంభించిన కేసీఆర్ తాజాగా బెంగళూరు లో దేవెగౌడ, కుమారస్వామి లతో చర్చించిన అనంతరం దేశంలో గుణాత్మక మార్పు రావాలని, రెండు మూడు నెలల్లో సంచలన వార్త వింటారు అని వ్యాఖ్యానించారు. జాతీయ స్థాయిలో మార్పు వచ్చి తీరుతుందని దానిని ఎవరూ ఆపలేరని పేర్కొన్న కేసీఆర్, రెండు మూడు నెలల్లో సంచలన వార్త వింటారు అని ప్రకటించారు. జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేసిన క్రమంలో పట్టు వదలకుండా ప్రయత్నాలు సాగిస్తున్నారు.

కెసీఆర్ 2024 ఎన్నికల రోడ్ మ్యాప్ సక్సెస్ అవుతుందా?

కెసీఆర్ 2024 ఎన్నికల రోడ్ మ్యాప్ సక్సెస్ అవుతుందా?

ఇప్పటికే సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తో, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ తోనూ, జేడీఎస్ అధినేత దేవెగౌడ, ఆయన కుమారుడు హెచ్.డి.కుమారస్వామి తోనూ చర్చలు జరిపిన కేసీఆర్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీతో భేటీ కానున్నారు. ఈ పార్టీలను ఏకతాటి మీదకు తీసుకు వస్తే, 2024 లోక్సభ ఎన్నికలకు ప్రత్యామ్నాయ మూడవ ఫ్రంట్ కు రోడ్ మ్యాప్ రెడీ అవుతుందని కెసిఆర్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే కెసిఆర్ ప్రాంతీయ పార్టీల మధ్య ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా కలిసికట్టుగా పని చేద్దామని ప్రతిపాదిస్తూ పర్యటనలు సాగిస్తున్నారు. ఇక ఈ పర్యటనలలో, అందరినీ ఏకతాటి మీదకు తీసుకురావటంలో కెసిఆర్ ఏ మేరకు సక్సెస్ అవుతారు అనేది వేచి చూడాల్సిందే.

English summary
KCR is preparing a roadmap for the 2024 elections without giving up. KCR is in talks with regional parties towards the Third Front, is expected to form a third front comprising the AAP, Trinamool and Samajwadi parties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X