కేసీఆర్ ఇంట్లో విషాదం: సోదరి మృతి, ఢిల్లీ పర్యటన మధ్యలోనే రద్దు చేసిన సీఎం
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సోదరి లీలమ్మ సోమవారం కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
లీలమ్మ-ఆమె భర్త శంకర్రావులకు ఇద్దరు కుమారులు కాంతారావు, మధుసూదన్ రావు ఉన్నారు. వారి స్వస్థలం రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి మండలం పదిర గ్రామం. కాగా, సోదరి లీలమ్మ మృతితో ఢిల్లీ పర్యటనను సీఎం కేసీఆర్ మధ్యలోనే రద్దు చేసుకున్నారు.

ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు అక్కడ్నుంచి హైదరాబాద్‌కు బయల్దేరనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేసీఆర్ రెండో సోదరి విమలాబాయి తుదిశ్వాస విడిచిన విషయం విదితమే.












Click it and Unblock the Notifications