ముస్లిం సోదరులకు కెసిఆర్ దావత్: నిజాం కళాశాలలో ఇఫ్తార్ విందు
హైదరాబాద్: రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులను ఆకర్షించే కార్యక్రమాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చేపడుతున్నారు. రంజాన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.26 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ విషయాన్ని ఆయన గురువారం సాయంత్రం మీడియా సమావేశంలో ప్రకటించారు.
ఈ నెల 8వ తేదీన నిజాం కళాశాల మైదానంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇఫ్తార్ విందు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలోని వంద మసీదుల్లో దావత్ - ఎ - ఇఫ్తార్ నిర్వహిస్తామని ఆయన చెప్పారు. లక్షాల 95 వేల మంది ముస్లిం కుటుంబాలకు దుస్తులు పంపిణీ చేస్తామని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఓ మసీదులో ఇఫ్తార్ విందు ఏర్పాటవుతుందని చెప్పారు.

కలెక్టర్లు జిల్లాల్లో ఇఫ్తార్ విందులు నిర్వహిస్తారని చెప్పారు. ఐదు వేల మసీదుల్లో పనిచేసే ఇమామ్‌లు, మౌజన్‌లకు రూ. 1000 భృతి ఇస్తామని చెప్పారు. రంజాన్ ఏర్పాట్ల పర్యవేక్షణకు ఎసిబి డిజి ఎకె ఖాన్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ రంజాన్ ఏర్పాట్లపై సమీక్షలు నిర్వహిస్తారని చెప్పారు.
ప్రతిష్టాత్మకంగా హరితహారం

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన హరితహారం పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం శ్రీకారం చుట్టనున్నారు. మధ్యాహ్నం 3గంటలకు చిలుకూరు బాలాజీ ఆలయం నుంచి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
ఇదే సమయంలో జిల్లాల్లో కూడా హరితహారాన్ని ప్రారంభించాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. హరితహారంలో పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులతోపాటు స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు భాగస్వాములు కావాలని సీఎం పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications