ప్రకాశ్ జవదేకర్‌కు సిఎం కెసిఆర్ కృతజ్ఞతలు
హైదరాబాద్: కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. దేశ చరిత్రలోనే మొదటి సారిగా 10 వేల ఎకరాల అటవీ భూమికి పర్యావరణ అనుమతిచ్చిన ఘనత ప్రకాశ్ జవదేకర్‌దేనని సిఎం కెసిఆర్ అన్నారు.
కేవలం నెలన్నర రోజుల్లో ఈ అనుమతి ఇచ్చారని సిఎం తెలిపారు. నల్గొండ జిల్లా దామచర్ల వద్ద చేపట్టనున్న థర్మల్ విద్యుత్ కేంద్రం కోసం భూమి ఉపయోగిస్తున్నామని చెప్పారు. దామరచర్ల వద్ద నీటి లభ్యత, ఫారెస్టు ల్యాండ్ లభ్యత ఎక్కువ ఉన్నందున అక్కడ విద్యుత్ ప్రాజెక్టు పెట్టడానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చామని సిఎం కెసిఆర్ చెప్పారు.

పార్లమెంటరీ కార్యదర్శుల బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
పార్లమెంటరీ కార్యదర్శుల బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. కాగా, పార్లమెంటరీ కార్యదర్శుల నియామక బిల్లును కాంగ్రెస్ సభ్యులు వ్యతిరేకించారు. ఎమ్మెల్యేలు కానివారికి మంత్రి పదవులిచ్చి.. ఎమ్మెల్యేలను మాత్రం పార్లమెంటరీ కార్యదర్శులను చేస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. పార్లమెంటరీ కార్యదర్శుల బిల్లు రాజ్యాంగ విరుద్ధమనిఅన్నారు.












Click it and Unblock the Notifications