ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర: టిడిపితో కాంగ్రెస్ చర్చలు, రిపోర్ట్స్‌న్నాయి: కెసిఆర్ సంచలనం

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్:తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు టిడిపితో కాంగ్రెస్ పార్టీ కుట్రలు పన్నిందని నా దగ్గర రిపోర్ట్‌లు ఉన్నాయని తెలంగాణ సీఎం కెసిఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

  మందకృష్ణ మాదిగ ను నిర్దాక్షిణ్యంగా అణచివేస్తామని కెసిఆర్ ప్రకటన

  తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై తెలంగాణ సీఎం కెసిఆర్ బుధవారం నాడు మాట్లాడారు. తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అనుసరించిన తీరుపై కెసిఆర్ నిప్పులు చెరిగారు.

  కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా తెలంగాణకు అన్యాయం చేసిందనే విషయమై కెసిఆర్ తన ప్రసంగంలో వివరించారు. తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ అణచివేసేందుకు ప్రయత్నించిందని కెసిఆర్ చెప్పారు.

  టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేశారు

  టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేశారు

  2014 ఎన్నికల సమయంలో తమ పార్టీ 63 ఎమ్మెల్యేలు గెలిచామన్నారు. అయితే తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరిగిందని అసెంబ్లీలో కెసిఆర్ చెప్పారు. ఆనాడు టిడిపి నేతలతో కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు సంప్రదింపులు చేశారని తన వద్ద రిపోర్టులు ఉన్నాయని కెసిఆర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకొనే ఉద్దేశ్యంతో తాను జాగ్రత్తగా వ్యవహరించానని కెసిఆర్ చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తక్కువ సీట్లు రావడంతో తట్టుకోలేక ఈ కుట్ర చేసేందుకు ప్రయత్నించారని కెసిఆర్ చెప్పారు.

   పరిమితికి లోబడి నిరసలు చేయాలి

  పరిమితికి లోబడి నిరసలు చేయాలి

  పరిమితికి లోబడి అసెంబ్లీలో నిరసనలు ఉండాలని తెలంగాణ సీఎం కెసిఆర్ అభిప్రాయపడ్డారు. కానీ, పరిమితి దాటితే సహించేది లేదన్నారు. ప్రజాస్వామ్యబద్దంగా తమ ప్రభుత్వం వ్యవహరిస్తోందని కెసిఆర్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నేతలు తమ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన చెప్పారు. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ మొదటి విలన్ అని కెసిఆర్ చెప్పారు.తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసింది కాంగ్రెస్ పార్టీయే అని కెసిఆర్ చెప్పారు.

  జానారెడ్డి, చిన్నారెడ్డిలు తెలంగాణ ఉద్యమానికి తూట్లు పొడిచారు.

  జానారెడ్డి, చిన్నారెడ్డిలు తెలంగాణ ఉద్యమానికి తూట్లు పొడిచారు.

  తెలంగాణ ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు జానారెడ్డి, చిన్నారెడ్డిలు తూట్లు పొడిచారని తెలంగాణ సీఎం కెసిఆర్ చెప్పారు. పదవులు రాకముందే తెలంగాణ ఉద్యమాన్ని ఎత్తుకొన్నారని చెప్పారు. పదవులు రాగానే తెలంగాణ ఉద్యమానికి చిన్నారెడ్డి, జానారెడ్డిలు పక్కన పెట్టారని కెసిఆర్ చెప్పారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాజీ మంత్రి జీవన్ రెడ్డి కూడ తెలంగాణను వ్యతిరేకించారని కెసిఆర్ చెప్పారు. దానం నాగేందర్, అంజన్ కుమార్ యాదవ్, రేణుకా చౌదరిలు కూడ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించారని కెసిఆర్ ఆరోపణలు చేశారు.

   మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడ దాడికి సహకరించారు

  మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడ దాడికి సహకరించారు

  తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం సందర్భంగా మండలి ఛైర్మెన్ స్వామిగౌడ్ దాడి చేసిన సమయంలో ఇప్పటికే ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల శాసనసభ్యత్వాలను రద్దు చేసినట్టు చెప్పారు. అయితే ఈ దాడిలో మరో ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సహకారం చేశారని వీడియో దృశ్యాల్లో ఉందని కెసిఆర్ చెప్పారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Telangana CM KCR said that Congress party was talks with TDP to dissolve the TRS government. KCR address in Telangana Assembly on Wednesday. He made sensational comments on Congress party.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి