రేవంత్‌కు కెసిఆర్ క్షమాపణ చెప్పాలి: ఎర్రబెల్లి, 'మళ్లీ జైలు ఖాయం'
వరంగల్/ హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో అరస్టయి జైల్లో ఉన్నతమ పార్టీ నేత రేవంత్‌రెడ్డికి బెయిల్ రావడం పట్ల తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకరరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. న్యాయం తమ వైపు ఉన్నందునే రేవంత్‌కు బెయిల్ వచ్చిందని అన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు రేవంత్‌రెడ్డికి క్షమాపణ చెప్పి అతనిపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, వారిని కెసిఆర్ తిరిగి గెలిపించుకుంటే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటామని ఎర్రబెల్లి దయాకరరావు సవాల్ విసిరారు. అవినీతిని ప్రశ్నించినందుకే తమను గత అసెంబ్లీ సమావేశాల్లో బయటకు పంపించారని, ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తే అవినీతిని బయటపెడుతామని ఆయన అన్నారు.

ఓటుకు నోటు కేసులో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి బెయిల్ లభించడం తాత్కాలిక ఉపశమనమేనని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయనకు బెయిల్ వచ్చిందంటూ టీడీపీ శ్రేణులు ర్యాలీలు, సంబరాలు చెయ్యడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని జీవన్‌రెడ్డి మండిపడ్డారు. రేవంత్‌కు బెయిల్ మంజూరును వ్యతిరేకిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏసీబీ సుప్రీంకోర్టుకు వెళుతోందని, రేవంత్ రెడ్డి మళ్లీ జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు.
హైదరాబాద్‌ను యూటీ చేయాలని ఏపీ మంత్రులు అంటుంటే తెలంగాణ టీడీపీ నేతలు నోరు ఎందుకు మెదపడంలేదని టీఆర్‌ఎస్ మరో ఎమ్మెల్యే గొంగిడి సునీత మండిపడ్డారు. హైదరాబాద్ తెలంగాణ ప్రజల అబ్బసొత్తు, తాతల సొత్తు అని అన్నారు. హైదరాబాద్‌పై కుట్రలు చేస్తామంటే సహించబోమని హెచ్చరించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఫోన్‌ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ అని ఓటుకు నోటు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఫోన్‌ట్యాపింగ్‌పై ఆధారాలుంటే బయటపెట్టాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications