పుణ్యానికి తెలంగాణ రాలేదు: కాంగ్రెస్ వస్తే అంధకారమేనంటూ కేసీఆర్ హెచ్చరికలు
మహబూబ్‌నగర్: తెలంగాణను ఎవరూ ఉత్త పుణ్యానికి ఇవ్వలేదని.. అన్ని వర్గాల ప్రజల పోరాటంతోనే తెలంగాణ సాధ్యమైందన్నారు ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం కోసం తాను ఆమరణ దీక్ష చేపట్టి చావు నోట్లో తలపెట్టి వచ్చానని గుర్తు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జడ్చర్లలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
తెలంగాణను ఎవడో ఇవ్వలేదు మనకు.. పుణ్యానికి ఇచ్చిపోలేదు మనకు తెలంగాణను అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కృష్ణా జలాల్లో మన హక్కు రావాలని పరిశోధన చేశామని కేసీఆర్ తెలిపారు. అంతకుముందు ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, ఇక్కడున్న కాంగ్రెస్ దద్దమ్మ ఎమ్మెల్యేలు.. వారికి నోరు లేక, అడగలేక జూరాల నుంచి నీళ్లు తీసుకోమని ఇచ్చారు. జూరాల బెత్తడు ప్రాజెక్టు. దాంట్ల నీళ్లు ఉండేదే 9 టీఎంసీలు. మనం తీసుకునేది 2 టీఎంసీలు ఒక దినానికి. అలా తీసుకుంటే మూడు రోజులకు ఖతం అయిపోతది. మళ్లా నీళ్లు ఎక్కడ్నుంచి తీసుకోవాలి అని కేసీఆర్ ప్రశ్నించారు.

'మళ్లా ఒక్కసారి గోల్ మాల్ చేయడానికి ఆంధ్రా ముఖ్యమంత్రులు జూరాల నుంచి సోర్స్ అని పెట్టారు. నేను చెప్పిన దాన్ని ఎందుకు తీసుకుంటం.. నాకర్థం కాదు అని ప్రశ్నించాను. శ్రీశైలం వాని అయ్య జాగీరా..? దాంట్ల మన పైసలు లేవా..? బాజాప్తా శ్రీశైలం నుంచే తీసుకోవాలని చెప్పి.. నేను అధికారులందరికీ చెప్పి పాలమూరు ఎత్తిపోతల పథకం సోర్స్‌ను జూరాల నుంచి శ్రీశైలంకు మార్చామని కేసీఆర్ చెప్పారు. కాంగ్రెస్ నేతలకు ఈ జిల్లా ప్రజలకు అన్యాయం చేసేందుకే ప్రయత్నించారని.. ఇప్పుడు కూడా అలాగే ఉన్నారన్నారు.
కాంగ్రెస్ చేసిన పొరపాటు వల్ల 60 ఏళ్లు గోసపడ్డామన్నారు కేసీఆర్. ఉన్న తెలంగాణను పోగొట్టింది కూడా కాంగ్రెస్ పార్టీయేనని మండిపడ్డారు. తెలంగాణను ఎవరూ ఇవ్వలేదు.. పోరాటం చేసి తెచ్చుకున్నామన్నారు. 9ఏళ్ల పోరాటం తర్వాత పాలమూరుకు అనుమతులు వచ్చాయన్నారు. నార్లాపూర్, ఏదుల, వట్టెం, ఉద్దండపూర్ రిజర్వాయర్లు, టన్నెల్స్‌లో పూర్తయ్యాయి. మోటర్లు బిగుస్తున్నారు. రాబోయే 3, 4 నెలల్లో అన్ని రిజర్వాయర్లలో బ్రహ్మాండంగా నీళ్లను చూడబోతున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు.
Live: ప్రజా ఆశీర్వాద సభ, మేడ్చల్ #KCROnceAgain #VoteForCar @chmallareddyMLA https://t.co/ePSdNSzdxj
— BRS Party (@BRSparty) October 18, 2023
పాలమూరులో కరవు అనేది పోతది. ఉద్దండపూర్ ప్రాజెక్టు పూర్తయితే జడ్చర్ల నియోజకవర్గంలోని 1.50 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి. కరవు అనేది మనవైపు కన్నెత్తి కూడా చూడదు. పాలమూరు పాలుకారే జిల్లాగా మారుతుంది అని కేసీఆర్ తెలిపారు. ఈ జిల్లా సస్యశ్యామలం కాబోతుంది అని కేసీఆర్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే రైతుబంధు, దళితబంధును ఎత్తేస్తారని.. రాష్ట్రంలో కరెంటు కోతలు మొదలై అంధకారంలోకి పోతామని హెచ్చరించారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications