Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అలాంటి తెలంగాణకు.. ఇలాంటి దుస్థితి ఎందుకు?: రేవంత్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు

సూర్యాపేట: దేశంలో నెంబర్ వన్ స్థానంలో ఉన్న తెలంగాణకు స్వల్పకాలంలోనే ఎందుకు ఈ దుస్థితి వచ్చిందని ప్రశ్నించారు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఆదివారం జనగామ, సూర్యాపేట జిల్లాల్లోని వివిధ మండలాల్లో పర్యటించిన అనంతరం సూర్యాపేటలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌ ఆయన మాట్లాడారు. రైతుల దుస్థితి చూస్తే చాలా బాధగా అనిపించిందని అన్నారు.

కాంగ్రెస్ వంద రోజుల పాలనలో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని కేసీఆర్ ఆరోపించారు. తెలంగాణలో రైతులు మళ్లీ ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి వస్తుందని అనుకోలేదన్నారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో అందరూ ఆలోచించుకోవాలని కోరారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో రైతులు బ్రహ్మాండంగా పంటలను సాగుచేసుకున్నారని, కానీ అనతికాలంలోనే ఇంతర దుర్భర పరిస్థితి వస్తదని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

kcr slams revanth reddy govt for farmers issues

దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉన్న తెలంగాణకు స్వల్ప కాలంలోనే ఈ దుస్థితికి ఎందుకు రావాలి? నీళ్లిస్తారని నమ్మి పంటలు వేసుకున్నాం. ముందు చెబితే వేసుకునేవాళ్లం కాదని రైతులు చెబుతున్నారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు అనుకూల విధానాలు చేపట్టింది. రైతుబంధు పేరిట పెట్టుబడి సాయం అందించామని కేసీఆర్ తెలిపారు. వ్యవసాయం అద్భుతమైన దశకు వెళ్లింది. పండిన ప్రతి గింజ కొన్నాం. ధాన్యం దిగుబడిలో పంజాబ్‌ను దాటేశామన్నారు.

అంతేగాక, అనతికాలంలోనే దేశంలోనే అగ్రస్థానానికి దూసుకుపోయింది. ఇది కట్టుకథ కాదు, పిట్టకథ కాదు, వాస్తవం. మరి ఇంత సుభిక్షంగా ఉన్న రాష్ట్రం పరిస్థితి ఇప్పుడు ఇంత అధ్వాన్నంగా మారడానికి కారణం ఎవరు..? లోపం ఎక్కడుంది? ఈ విషయంపై ప్రజలతోపాటు జర్నలిస్టు మిత్రులు కూడా బాగా ఆలోచన చేయాలి' అని కేసీఆర్‌ సూచించారు. వరి పంటకు రూ. 500 బోనస్ ఇవ్వాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత తొందరగా కేవలం 100 రోజులలోపే రైతులకు ఇంత దుర్భర పరిస్థితి వస్తదని అనుకోలేదు. కేవలం 100 రోజుల పరిపాలనలో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మేం రైతులకు అన్ని ఏర్పాట్లు చేసి పెట్టినా ఈ దుస్థితి ఎందుకొచ్చింది? దేశంలోనే ఉత్పత్తిలో నంబర్‌ వన్‌ స్థాయికి ఎదిగిన రాష్ట్రం అనతికాలంలో ఈ స్థాయికి ఎందుకు దిగజారిందని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

మిషన్‌ భగీరథ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఇంటికో నల్లా పెట్టి నీళ్లు ఇచ్చిన రాష్ట్రంలో తాగునీటికి కరువు ఎందుకొచ్చినట్టు..? మా టైమ్‌లో బ్రహ్మాండంగా తాగునీటి సరఫరా జరిగింది. ఎక్కడా నీళ్ల ట్యాంకర్లు కనపడలే. ఏ ఆడ బిడ్డ కూడా వీధుల్లో బింద పట్టుకుని కనపడలే. కానీ, ఇప్పుడు హైదరాబాద్‌ నగరంలో కూడా ట్యాంకర్లతో నీళ్లు సరఫరా చేసే దుస్థితి ఎందుకొచ్చింది?' అని కేసీఆర్‌ నిలదీశారు. తాము హైదరాబాద్‌ను పవర్ ఐలాండ్ సిటీగా మార్చామన్నారు. రాత్రింబవళ్లు కొట్లాడి నేషనల్ పవర్ గ్రిడ్ కు అనుసంధానం చేయించామన్నారు. 24 గంటలపాటు కరెంట్ ఇచ్చామని
చెప్పుకొచ్చారు.

రాష్ట్రంలో కరువు పరిస్థితులకు అసమర్థ కాంగ్రెస్‌ ప్రభుత్వమే కారణమని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ విమర్శించారు. మరోవైపు, కాంగ్రెస్‌ హయాంలో పోలీసులు ప్రజలపట్ల, ప్రతిపక్ష పార్టీ శ్రేణులపట్ల దురుసుగా వ్యవహరిస్తున్నారని కేసీఆర్‌ మండిపడ్డారు. ఈ దురుసు ప్రవర్తనను తగ్గించుకోవాలని హెచ్చరించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, అధికార పార్టీ కోసం దురుసుగా ప్రవర్తించడం సబబు కాదని కేసీఆర్‌ హితవు పలికారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+