కేసీఆర్ తాజా నిర్ణయంతో కవిత ఉక్కిరి బిక్కిరి..!!

తెలంగాణ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కవిత లేఖ నుంచి వరుసగా జరుగుతున్న పరిణామాలు బీఆర్ఎస్ లో కలకలం రేపుతున్నాయి. కవిత తన అన్న కేటీఆర్ లక్ష్యంగా చేసిన వ్యాఖ్యల పైన కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇద్దరు బిడ్డల మధ్య వచ్చిన సమస్య పార్టీకి నష్టం చేయకూడదనే భావనతో ఉన్నారు. అందులో భాగంగా వ్యూహాత్మకంగా కేటీఆర్ విదేశీ పర్యటనకు వెళ్లారు. కవిత ఇప్పటి వరకు కేసీఆర్ తో మాట్లాడే ప్రయత్నం చేసినా అవకాశం దక్క లేదు. ఇక, తన విషయంలో కేసీఆర్ తాజా నిర్ణయాలు కవితను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.

కేసీఆర్ వ్యూహం
కవిత వ్యవహారంలో కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. కవిత రాసిన లేఖ బయటకు వచ్చిన తరువాత చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపాయి. కేటీఆర్ పైన కవిత చేసిన పరోక్ష వ్యాఖ్యల కంటే బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి ప్రయత్నం చేసారంటూ చెప్పిన అంశాలను కేసీఆర్ సీరియస్ గా తీసుకున్నారని సమాచారం. దీంతో, తాజాగా హరీష్ ద్వారా బీఆర్ఎస్ ఏ పార్టీ తోనూ పొత్తు పెట్టుకోదని క్లారిటీ ఇప్పించారు. సింగిల్ గానే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని కేసీఆర్ మాటగా హరీష్ పార్టీ నేతలకు స్పష్టం చేసారు. అటు కేటీఆర్ ఇప్పటి వరకు కవిత వ్యవహారం పైన స్పందించ లేదు. కవితకు కేసీఆర్ నుంచి పిలుపు లేదు. తనకు తన తండ్రి నుంచి పిలుపు వస్తుందని కవిత ఆశాభావంతో ఉన్నారు.

kcr-strategical-move-in-kavitha-episode-key-orders-for-ktr

కవిత వెయిటింగ్
ఈ వివాదం మొదలై జరిగి పది రోజులు దాటినా కేసీఆర్ ఇంతవరకు కవితను పిలిచి మాట్లాడ లేదు.. సమయం కూడా ఇవ్వలేదు. కవిత కార్యక్రమాలకు బీఆర్ఎస్ లీడర్లు, క్యాడర్ దూరంగా ఉన్నారు. జాగృతి ఆధ్వర్యంలోనే కవిత తన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కేసీఆరే తన నాయ కుడు అంటున్నప్పటికీ.. బీఆర్ఎస్ కార్యకర్తలు దూరంగా ఉంటున్నారు. కేసీఆర్.. బీఆర్ఎస్ కాపాడుకోవటం తన లక్ష్యమని చెప్పినా.. కవితకు మద్దతుగా ఎవరూ వెళ్లకుండా నివారించటం లో కేసీఆర్ సక్సెస్ అయ్యారు. అదే సమయంలో కేటీఆర్ కు అనుకూలంగా ఎక్కడా వ్యాఖ్యలు రాకుండా జాగ్రత్త పడ్డారు. కవిత పదే పదే తన తండ్రి పైన అభిమానం చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయినా, కేసీఆర్ మాత్రం మెత్తబడలేదు. కుమార్తెతో మాట్లాండేందుకు ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు.

పార్టీ మద్దతు లేని కవిత
కవితకు పార్టీ నుంచి మద్దతు లేకపోవటంతో కవిత ప్రస్తుతానికి తెలంగాణ జాగృతి ద్వారా కార్యక్ర మాలు నిర్వహించాలనే నిర్ణయంతోనే ఉన్నారని సమాచారం. తండ్రి నుంచి పిలుపు వచ్చినా, రాకున్నా.. తన పని తాను జాగృతి ద్వారా చేసుకుపోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక, అటు కేటీఆర్ మరో నాలుగు రోజుల పాటు అమెరికాలోనే ఉండనున్నారు. ఈనెల‌ 10న‌ అమెరికా నుంచి కేటీఆర్ హైదరాబాద్ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. కేసీఆర్ 11న కాళేశ్వరం కమిషన్ విచారణకు వెళ్ళనున్నారు. దీంతో 10న హైదరాబాద్‌కు వచ్చేలా కేటీఆర్ ప్రణాలికలు చేసుకు న్నారు. కవిత వివాదం ఏ పరిస్థితుల్లోనూ స్పందించ వద్దని కేటీఆర్ కు కేసీఆర్ సూచించినట్లు సమాచారం. దీంతో, కవిత తన తండ్రి నిర్ణయం అంతు చిక్కక.. తాను ఎలాంటి నిర్ణయం తీసుకో లేక ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. కేసీఆర్ కాళేశ్వరం విచారణకు హాజరు తరువాత కవిత విషయం లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+