కాళేశ్వరం గొప్పతనం చెప్దురు రండి కేసీఆర్.. మేడిగడ్డకు రేవంత్ రెడ్డి బృందం!!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు నేడు మేడిగడ్డ సందర్శన తెలంగాణ రాజకీయాల్లో హాట్ హాట్ గా మారింది . మేడిగడ్డ ప్రాజెక్టును పరిశీలించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ నుండి నాలుగు బస్సుల్లో ప్రయాణమయ్యారు. ఈ పర్యటనకు బీఆర్ఎస్, బిజెపి సభ్యులు దూరంగా ఉన్నారు.

అంతకుముందు తెలంగాణ అసెంబ్లీలో నీటిపారుదల శాఖ పని తీరు, ప్రాజెక్టుల నిర్మాణం, నిర్ణయాలు, నిర్లక్ష్యం, అవకతవకలు వంటి అన్ని అంశాలను శాసనసభలో చేర్చించేలా త్వరలో శ్వేత పత్రం విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అందుకు వీలుగా మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన చోటును, అన్నారం, సుందిళ్ళ బ్యారేజిల స్థితిగతులను స్వయంగా చూసి తెలుసుకునేందుకు వీలుగా శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులందరూ మేడిగడ్డ సందర్శనకు రావాలని ముఖ్యమంత్రి ఆహ్వానించారు.

KCR to tell about greatness of Kaleshwaram.. Revanth Reddy call to come Medigadda!!

ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, మరో సీనియర్ మాజీ మంత్రి కడియం శ్రీహరి తప్పనిసరిగా ఈ సందర్శనకు వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టును ప్రపంచంలోనే అద్భుతంగా తీర్చిదిద్దిన తీరును సభ్యులకు తెలియజేయాలని కోరారు. హరీష్ రావును ఉద్దేశించి కాళేశ్వరరావు అంటూ వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ కోసం ప్రత్యేకంగా బేగంపేట ఎయిర్పోర్ట్ లో హెలికాఫ్టర్ ను ప్రభుత్వం సిద్ధంగా ఉంచిందని తెలిపారు.

రాష్ట్రాన్ని సశ్యశ్యామలం చేసేందుకు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును 2008 లో నాటి ప్రభుత్వం 38 వేల 500 కోట్ల రూపాయిలతో టెండర్లు పిలిచినట్లు, అయితే గత ప్రభుత్వం రీడిజైన్ పేరుతో లక్షా 47 వేల కోట్ల రూపాయిలకు అంచనా వ్యయాన్ని పెంచిందనీ ఆరోపించారు. కేంద్ర డ్యాం సేఫ్టీ అధికారులు మేడిగడ్డ నిర్మాణ లోపాలతో కుంగినట్లు చెబుతూ ఉంటే, గత ప్రభుత్వం ఇసుక కదిలి బ్యారేజ్ కుంగిందని చెప్పినట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

కుంగిన బ్యారేజిని ఎవరూ చూడకుండా భారీ భద్రత ఏర్పాటు చేశారనీ, కొందరు అధికారులు ఫైళ్ళు మాయంచేసినట్లు కధనాలు వెలువడిన నేపధ్యంలో నిజానిజాలను స్వయంగా చూసి శాసనసభ్యులు తెలుసుకునేందుకు మేడిగడ్డ బ్యారేజి సందర్శనను ఏర్పాటు చేసినట్లు వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో వాస్తవాలు రాష్ట్ర ప్రజలకు తెలిసి తీరాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కాగా, మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు శాసనసభ్యులు వెళ్ళేందుకు వీలుగా స్పీకర్ గడ్డం ప్రసాద కుమార్ సభను రేపటికి వాయిదా వేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+