గోల్కొండలో జెండా ఎగురవేసిన కేసీఆర్: మోడీ మెచ్చుకున్నారంటూ ప్రసంగం
Recommended Video

గోల్కొండలో జెండా ఆవిష్కరించిన కేసీఆర్
హైదరాబాద్: 72వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బుధవారం ఉదయం గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఎగురవేశారు. పోలీసుల గౌరవవందనాన్ని సీఎం స్వీకరించారు.
అంతకుముందు పరేడ్ మైదానంలో సైనికుల స్మారకం వద్ద సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. అక్కడ్నుంచి నేరుగా కేసీఆర్ గోల్కొండ కోటకు బయల్దేరారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

‘అసాధ్యమనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సుస్దాధ్యం చేసేవరకు విశ్రమించలేదు. నేడు అదే సంకల్పబలంతో బంగారు తెలంగాణ నిర్మాణం కోసం పునరంకిత మవుతున్నాను. ఈ ప్రయాణంలో ప్రజలే నాకు అండదండ. వారి దీవెనలే ప్రేరణ. తెలంగాణ విజయయాత్ర ఇదే విధంగా కొనసాగేందుకు తగిన బలాన్ని తెలంగాణ ప్రజలు ఎప్పటికప్పుడు అందించాలని మరోసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను’ అని కేసీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు.
‘హైదరాబాద్ నగరం శరవేగంగా విస్తరిస్తున్నందున ఔటర్ రింగు రోడ్డుకు అవతల 330 కిలోమీటర్ల రీజనల్ రింగు రోడ్డు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రీజనల్ రింగు రోడ్డు సంగారెడ్డి-గజ్వేల్-చౌటుప్పల్-మాల్-కడ్తాల్-షాద్ నగర్- చేవెళ్ల-కంది పట్టణాల మీదుగా వలయాకారంలో ఉంటుంది. అంతర్జాతీయ స్థాయి ఎక్స్ ప్రెస్ హైవేగా రీజనల్ రింగురోడ్డును నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది’ అని కేసీఆర్ తెలిపారు.
‘ఎన్నో దిగ్గజ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నాయి. అంకుర పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఏర్పాటుచేసిన టి-హబ్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఐ.టి ఎగుమతులు ఈ ఏడాది లక్ష కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ఐ.టి. పరిశ్రమను రాష్ట్రంలోని ఇతర నగరాలకు విస్తరించడంలో రాష్ట్ర ప్రభుత్వం సఫలమవుతోంది’ అని సీఎం వివరించారు.
‘తెలంగాణ రాష్ట్రం ఐ.టి రంగంలో బలీయమైన శక్తిగా ఎదిగింది. ప్రపంచంలో హైదరాబాద్ ప్రముఖ ఐ.టి హబ్ గా గుర్తింపు పొందింది. రాష్ట్రప్రభుత్వం రూపొందించిన నూతన ఐ.టి విధానంతోపాటు, సింగిల్ విండో పారిశ్రామిక అనుమతుల విధానం వల్ల ఐ.టి రంగంలో గణనీయమైన పెట్టుబడులు రావడం ప్రారంభమైంది’ అని కేసీఆర్ చెప్పారు.
‘వెనుకబడిన కులాల వారికి ఈ రోజు ఒక శుభవార్తను తెలిపేందుకు సంతోషిస్తున్నాను. బిసి కులాల వారు వారికి నచ్చిన పని చేసుకోవడానికి వీలుగా, తగిన ఆర్ధిక సహకారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం బ్యాంకులతో నిమిత్తం లేకుండా, లబ్దిదారులు ఒక్క రూపాయి వాటాధనం చెల్లించ వలసిన అవసరం లేకుండా, వందకు వంద శాతం ఉచితంగా బిసిల కులాల వారందరికీ స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం ధన సహాయం చేస్తుంది. ఇందుకోసం లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభించమని ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశాం’ అని కేసీఆర్ చెప్పారు.
READ MORE












Click it and Unblock the Notifications