కేసీఆర్‌కు కొత్త చిక్కు, తగ్గండి.. టిక్కెట్‌పై ఎమ్మెల్సీలకు తీవ్ర హెచ్చరిక

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీలో పలుచోట్ల ఎమ్మెల్యేలు వర్సెస్ ఎమ్మెల్సీలుగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఓ వైపు ఎమ్మెల్యేలు, మరోవైపు ఆయా నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు పావులు కదుపుతున్నారు.

ఇదిగో రేవంత్ కులపిచ్చి, అందుకే ఓటుకు నోటులో సహకరించాం: మత్తయ్య సంచలనం

ఈ విషయం టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దృష్టికి వెళ్లింది. దీనిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఎమ్మెల్సీలకు ఆయన హెచ్చరికలు జారీ చేశారని సమాచారం.

ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకున్న కేసీఆర్

ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకున్న కేసీఆర్

ఆయా జిల్లాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య ఉన్న రగడకు సంబంధించి సీఎం కేసీఆర్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా నివేదికలు తెప్పించుకున్నారని తెలుస్తోంది. కొందరు నేతల నుంచి కూడా మరింత సమాచారం కోసం ఆరా తీశారని తెలుస్తోంది.

టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక

టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక

టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్, టీడీపీ, ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆ పార్టీలో చేరారు. ఎమ్మెల్యేలు ఉన్నచోట ఇంచార్జులు, ఇంచార్జులు ఉన్నచోట ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇలా తెరాసలో చేరారు.

టిక్కెట్ వస్తుందని ధీమా

టిక్కెట్ వస్తుందని ధీమా


ఎన్నికల సమయంలో టిక్కెట్ తమకే వస్తుందని నేతలు అందరూ ధీమాగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ సమయంలో ఇటు ఎమ్మెల్యేలు, అటు ఎమ్మెల్సీలు తమకే టిక్కెట్ వస్తుందని స్థానికంగా ప్రచారం చేసుకుంటున్నారు. కేసీఆర్ తనకే టిక్కెట్ ఇస్తారని చెబుతున్నారు.

కేసీఆర్ ఆగ్రహం

కేసీఆర్ ఆగ్రహం

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోటాపోటీగా తమకే టిక్కెట్ అని చెప్పుకోవడంపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్సీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో జోక్యం చేసుకోవద్దని చెప్పారని సమాచారం. దీంతో టిక్కెట్లు తమకు వస్తాయా అనే ఆందోళనలో పలువురు ఎమ్మెల్సీలు ఉన్నారని సమాచారం.

కేసీఆర్ హెచ్చరిక

కేసీఆర్ హెచ్చరిక

పూర్వ నల్గొండ, వరంగల్, రంగారెడ్డి, నిజామాబాద్ తదితర జిల్లాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య టిక్కెట్ పోరు నడుస్తోంది. దీనిపై సమగ్ర సమాచారం తెప్పించుకున్న కేసీఆర్.. ఎమ్మెల్సీలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారని అంటున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana Chief Minister Kalvakuntla Chandrasekhar Rao unhappy with some MLCs in some districts.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి