కేసీఆర్ వర్సెస్ గవర్నర్ తమిళి సై; కేంద్రానికి నివేదిక; కేంద్రం సీరియస్ గా తీసుకుంటుందా?
రిపబ్లిక్ డే వేడుకల సాక్షిగా మరోమారు గవర్నర్ వర్సెస్ తెలంగాణా ప్రభుత్వం మధ్య యుద్ధం కొనసాగుతుంది. తెలంగాణలో రాజ్యాంగ ఉల్లంఘన గురించి కేంద్రానికి నివేదిక పంపించాను అని చెప్పడం ఆసక్తికర చర్చకు కారణంగా మారింది.
తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ తమిళిసైకి, తెలంగాణ ప్రభుత్వానికి మధ్య ప్రచ్చన్న యుద్ధం కొనసాగుతోంది. గవర్నర్ గా తమిళి సై బాధ్యతలు చేపట్టిన నాటినుండి ఆమెను బిజెపి ప్రతినిధిగా ముద్ర వేసి తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ ప్రమేయం లేకుండా తన పని తాను చేసుకుపోతుంది. కనీసం ప్రోటోకాల్ కూడా పాటించకుండా తనను ఇబ్బంది పెడుతున్నారని గవర్నర్ తమిళి సై ఇప్పటికే అనేకమార్లు మీడియా సాక్షిగా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గతంలోనూ తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితిని కేంద్రానికి నేరుగా వెళ్లి మరీ వివరించి వచ్చారు.

తెలంగాణలో గవర్నర్ వర్సెస్ కేసీఆర్
ఇక ప్రస్తుతం కూడా రిపబ్లిక్ డే వేడుకలు ప్రభుత్వం నిర్వహించకపోవడం, హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ పట్టించుకోకపోవడంతో పాటుగా, గవర్నర్ ను టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉండడం వెరసి తెలంగాణలో గవర్నర్ వర్సెస్ కేసీఆర్ అన్న పరిస్థితి చోటుచేసుకుంది.
నిన్నటికి నిన్న గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రసంగంలోనూ గవర్నర్ తమిళిసై తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొందరికి ఫామ్హౌసులు కాదు.. అందరికీ ఫామ్ లు ఉండాలని పేర్కొన్నారు. తాను కొంతమందికి నచ్చకపోవచ్చు అంటూ పేర్కొన్న ఆమె తెలంగాణ ప్రజలు అంటే తనకు ఇష్టమని, వారి కోసం ఎంత కష్టమైనా భరిస్తానంటూ తేల్చి చెప్పారు.

అక్కడ ఐదు లక్షల మందితో సభ.. గణతంత్ర వేడుకలకే కరోనా సాకు.. కేంద్రానికి నివేదిక
తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని గవర్నర్ తమిళిసై అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుందని గవర్నర్ తమిళిసై ప్రకటించారు. తెలంగాణలో జెండా ఆవిష్కరణ తరువాత పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్న తమిళి సై పుదుచ్చేరికి వెళ్లారు.
అక్కడ కూడా ఆమె కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా మహమ్మారి పేరుతో గణతంత్ర వేడుకలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని పేర్కొన్న ఆమె ఖమ్మం జిల్లాలో కేసీఆర్ ఐదు లక్షల మందితో సభ నిర్వహించారని గుర్తు చేశారు. ఇక ఈ విషయాలు అన్నింటిపై కేంద్రానికి తాను నివేదిక పంపించానని తమిళి సై ప్రకటించారు.

కేంద్రానికి గవర్నర్ నివేదిక... కేంద్రం సీరియస్ గా తీసుకుంటుందా?
ఇప్పటికే అనేక పర్యాయాలు గవర్నర్ తమిళి సై కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వ తీరుపై ఫిర్యాదులు చేశారు. ఇప్పుడు తాజాగా మరో మారు తెలంగాణలో రాజ్యాంగ ఉల్లంఘన గురించి కేంద్రానికి నివేదిక పంపించాను అని చెప్పడం ఆసక్తికర చర్చకు కారణంగా మారింది.
మరి గవర్నర్ తమిళి సై పంపించిన నివేదికలను కేంద్రం సీరియస్ గా తీసుకుంటుందా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనా తాజాగా రిపబ్లిక్ డే వేడుకల సాక్షిగా గవర్నర్ తమిళి సై వర్సెస్ సీఎం కేసీఆర్ మరోమారు రగడ కొనసాగుతుండడంతో ఈ వ్యవహారంలో ఏం జరగబోతుంది అన్నది అటు రాజకీయ వర్గాలలోను, ఇటు ప్రజలలోను ఆసక్తిని రేకెత్తిస్తుంది.

రాష్ట్రపతి పాలనకు గవర్నర్ సిఫార్సు చేశారా? చర్చ
ఒకవేళ ఈ వ్యవహారంలో కేంద్రం సీరియస్ గా తీసుకుంటే పరిణామాలు చాలా ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది. తెలంగాణాలో రాష్ట్రపతి పాలనకు గవర్నర్ సిఫార్సు చేశారా? అన్న చర్చ కూడా జోరుగా సాగుతుంది. ఏది ఏమైనా చిలికి చిలికి గాలివానగా మారుతున్న ఈ వివాదానికి కేంద్రం ఫుల్ స్టాప్ పెడుతుందా? లేకా ఇది ఇలాగే కొనసాగుతుందా? అన్నది తెలియాల్సి ఉంది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications