Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జిల్లాల్లో కేంద్ర కరువు బృందం పర్యటన: తక్షణ సాయం చేయాలన్న కెసిఆర్(పిక్చర్స్)

హైదరాబాద్: కరువు పరిస్ధితులను ఎదుర్కొనేందుకు తాత్కాలిక, దీర్ఘకాలిక వ్యూహాలను అనుసరించేందుకు కేంద్రం సహాయం కావాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు కోరారు. కరువు మండలాల రైతులకు వెంటనే ఇన్‌పుట్ సబ్సిడీ అందివ్వాలని, పశుగ్రాసానికి నిధులు విడుదల చేయాలని కోరారు. వ్యవసాయాన్ని ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేయాలని, ఈ పథకం కింద పనిదినాలను 200 రోజులకు పెంచాలని అన్నారు.

రాష్ట్రంలో కరువు పరిస్థితులను అధ్యయనం చేయడానికి వచ్చిన కేంద్ర బృందం మహబూబ్‌నగర్, నల్గొండ, వరంగల్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో పర్యటన ముగిసిన తర్వాత మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రితో సమావేశమైంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారితో మాట్లాడుతూ.. కరువులో రైతులను ఆదుకునేందుకు ఇన్‌ఫుట్ సబ్సిడీ, కరువు మండలాల్లో పని దినాలు పెంచాలని కోరారు.

ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల వల్ల కరువు ఏర్పడినప్పటికీ, కరువును ఎదుర్కునే స్థితిలో రాష్ట్రం లేకపోవడానికి సమైక్య పాలకుల వివక్షే కారణమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సమైక్యపాలనలో తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మించలేదని, చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేయకుండా తాత్సారం చేశారని ముఖ్యమంత్రి వివరించారు. వ్యవసాయాన్ని జాతీయ ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.

రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులను కరువు బృందానికి సవివరంగంగా వివరించి కేంద్రం నుంచి తక్షణ సాయం అందేలా చూడాలని ముఖ్యమంత్రి కోరారు. ముఖ్యమంత్రిని కలిసిన కేంద్ర బృందంలో కేంద్ర వ్యవసాయశాఖ సంయుక్త కార్యదర్శి ఉత్పల్ కుమార్ సింగ్, అయిల్‌సీడ్స్ డైరెక్టర్ పొన్నుస్వామి, డిజాస్టర్ మేనేజిమెంట్ అసిస్టెంట్ కమిషనర్ వినోద్ ఎగ్‌బూట్ తదితరులు ఉన్నారు.

కేంద్ర బృందం

కేంద్ర బృందం

కరువు పరిస్ధితులను ఎదుర్కొనేందుకు తాత్కాలిక, దీర్ఘకాలిక వ్యూహాలను అనుసరించేందుకు కేంద్రం సహాయం కావాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు కోరారు.

కేంద్ర బృందం

కేంద్ర బృందం

కరువు మండలాల రైతులకు వెంటనే ఇన్‌పుట్ సబ్సిడీ అందివ్వాలని, పశుగ్రాసానికి నిధులు విడుదల చేయాలని కోరారు.

కేంద్ర బృందం

కేంద్ర బృందం

వ్యవసాయాన్ని ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేయాలని, ఈ పథకం కింద పనిదినాలను 200 రోజులకు పెంచాలని అన్నారు.

కేంద్ర బృందం

కేంద్ర బృందం

రాష్ట్రంలో కరువు పరిస్థితులను అధ్యయనం చేయడానికి వచ్చిన కేంద్ర బృందం మహబూబ్‌నగర్, నల్గొండ, వరంగల్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో పర్యటన ముగిసిన తర్వాత మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రితో సమావేశమైంది.

కేంద్ర బృందం

కేంద్ర బృందం

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారితో మాట్లాడుతూ.. కరువులో రైతులను ఆదుకునేందుకు ఇన్‌ఫుట్ సబ్సిడీ, కరువు మండలాల్లో పని దినాలు పెంచాలని కోరారు.

కేంద్ర బృందం

కేంద్ర బృందం

మంచినీటి ఎద్దడి నివారణ, పశువులకు దాణా వంటి తక్షణ కార్యక్రమాలు చేపట్టడంతో పాటు నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం, భూగర్భ జలాల పెంపు, అడవుల అభివృద్ధి వంటి దీర్ఘకాలిక చర్యలు తీసుకోవాలన్నారు.

కేంద్ర బృందం

కేంద్ర బృందం

తెలంగాణలో కరువు పరిస్థితులను అధిగమించేందుకు వెంటనే కరువు మండలాలుగా ప్రకటించిన 231 మండలాల్లో రైతులను ఇన్‌ఫుట్ సబ్సిడీ ఇవ్వాలని, గ్రామీణ ఉపాధి హామీ పథకం పని దినాలను 200 రోజులకు పెంచాలని, పశుగ్రాసానికి నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కోరారు.

కేంద్ర బృందం

కేంద్ర బృందం

అలాగే తెలంగాణలో ఒక భారీ నీటిపారుదల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

కేంద్ర బృందం

కేంద్ర బృందం

రాష్ట్రంలో జూన్ మొదటి వారంలో మంచి వర్షాలు కురిసి ఆ తర్వాత ఖరీఫ్ సీజన్ ముగిసిపోయే దశలో సెప్టెంబర్ చివర్లో వర్షాలు కురిసాయని ముఖ్యమంత్రి వివరించారు.

కేంద్ర బృందం

కేంద్ర బృందం

దీని వల్ల పంటలకు ఏమాత్రం మేలు జరుగకపోవడం వల్ల కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని, అలాగే చాలా ప్రాంతాల్లో వర్షాలు కురియకపోవడం వల్ల తాగునీటి ఎద్దడి ఏర్పడిందని ముఖ్యమంత్రి వివరించారు.

కేంద్ర బృందం

కేంద్ర బృందం

ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల వల్ల కరువు ఏర్పడినప్పటికీ, కరువును ఎదుర్కునే స్థితిలో రాష్ట్రం లేకపోవడానికి సమైక్య పాలకుల వివక్షే కారణమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

కేంద్ర బృందం

కేంద్ర బృందం

సమైక్యపాలనలో తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మించలేదని, చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేయకుండా తాత్సారం చేశారని ముఖ్యమంత్రి వివరించారు.

కేంద్ర బృందం

కేంద్ర బృందం

1964లో చేపట్టిన శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తికాకపోవడమే గత పాలకుల వివక్షకు, నిర్యక్ష్యానికి నిదర్శనమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

సిఎంతో కేంద్రబృందం

సిఎంతో కేంద్రబృందం

తెలంగాణ పరివాహకం నుంచి ఏటా 1600 టిఎంసిల నీరు సముద్రంలో వృధాగా కలుస్తోన్న ఆ నీటిని వినియోగించుకునేందుకు ప్రాజెక్టులను నిర్మించలేదన్నారు.

సిఎంతో కేంద్రబృందం

సిఎంతో కేంద్రబృందం

ఈ కారణంగా రైతులు సాగునీటి కోసం 21 లక్షల గొట్టపు బావులను తవ్వించుకొని వ్యవసాయం చేయాల్సి వచ్చిందని ముఖ్యమంత్రి చెప్పారు.

అధికారులతో కేంద్రబృందం

అధికారులతో కేంద్రబృందం

భూగర్భ జలాలు అడుగంటిపోవడం వల్ల ప్రస్తుతం తవ్విన గొట్టపు బావులు కూడా ఎండిపోయాయన్నారు. ఈ పరిస్థితులను అధిగమించడానికే తమ ప్రభుత్వం ప్రాజెక్టులకు రీడిజైన్ చేసి ప్రతినీటి చుక్కను వినియోగించుకునేందుకు ప్రణాళికలు రూపొందించిందన్నారు.

టిడిపి లీడర్స్ మెమోరాండం

టిడిపి లీడర్స్ మెమోరాండం

దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో కేంద్రమే ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాల్సిన అవసరం ఉందని, ఇందులో భాగంగానే తమ రాష్ట్రంలో ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా అడుగుతున్నామని ముఖ్యమంత్రి వివరించారు.

కాంగ్రెస్ లీడర్స్ మెమోరాండం

కాంగ్రెస్ లీడర్స్ మెమోరాండం

కరువు పరిస్థితుల్లో తాగునీటి ఎద్దడి వంటి సమస్య రాకుండా ఉండేందుకే తమ ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని చేపట్టిందన్నారు. వ్యవసాయరంగం భవిష్యత్‌లో మరింత సంక్షోభాన్ని ఎదుర్కొబోతుందని, దీని నుంచి బయటపడే మార్గాలను కేంద్రం ఆలోచించాలని సూచించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+