ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి బిగ్ షాక్ ఇవ్వనున్న కేసీఆర్!!

ఈటల రాజేందర్ పై హత్య కుట్ర ఎపిసోడ్ బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి పై చర్చకు కారణంగా మారింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో క్షేత్ర స్థాయిలో బలం పెంచుకొని ఎన్నికలలో ఈటలను బలంగా ఢీ కొడతాడు అని భావించిన పాడి కౌశిక్ రెడ్డి వరుసగా వివాదాలలో తలదూర్చడంతో ఆయన విషయంలో అధిష్టానం ఇక కీలక నిర్ణయం తీసుకుంటున్నట్టు ప్రస్తుతం ప్రచారం జరుగుతుంది.

ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి కి షాక్ ఇవ్వడానికి కేసీఆర్ రెడీ అయినట్టు సమాచారం. గత కొంతకాలంగా పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారం వివాదాస్పదంగా తయారైంది. సొంత పార్టీ నేతలు కూడా ఆయన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం లో ఈటల ను దీటుగా ఎదుర్కొంటారని భావించి ఎమ్మెల్సీగా పాడి కౌశిక్ రెడ్డి కి గులాబీ బాస్ కెసిఆర్ పట్టం కట్టారు.

mlcpadikaushikreddykcr

ఇక మంత్రి కేటీఆర్ కూడా హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలిచేది పాడి కౌశిక్ రెడ్డి అని సభాముఖంగా తేల్చిచెప్పారు. అయితే ఇప్పుడు తాజా పరిణామాలతో హుజూరాబాద్ నియోజకవర్గం లో పాడి కౌశిక్ రెడ్డి కి అవకాశం ఇస్తే ఓటమి పాలు కావడం ఖాయమని గులాబీ బాస్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈటల రాజేందర్ పై ఇనుగాల పెద్దిరెడ్డిని బరిలోకి దింపే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది.

మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డికి టికెట్ ఇస్తే ఎలా ఉంటుందన్నది కెసిఆర్ ప్రస్తుతం ఆరా తీస్తున్నారని తెలుస్తోంది. హుజూరాబాద్ నియోజకవర్గం లో రాజేందర్ కు మంచి పట్టు ఉంది. ఆయనను ఓడించటానికి ప్రజాక్షేత్రంలో పనిచేసి ప్రజల మనసు గెలుచుకొని ఈటల రాజేందర్ కు చెక్ పెట్టాలని బీఆర్ఎస్ భావించింది.

అయితే ఎమ్మెల్సీ గాను, ప్రభుత్వ విప్ గానూ అవకాశం వచ్చిన పాడి కౌశిక్ రెడ్డి చేయాల్సిన పనులు కాకుండా, వివాదాలలో తలదూర్చడం అధిష్టానానికి ఆగ్రహం తెప్పిస్తుంది. ఈ క్రమంలోనే పాడి కౌశిక్ రెడ్డి కి అధిష్టానం ఊహించని షాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+