పెట్టుబడులపై చైనా ఆసక్తి: గం.కు 300కి.మీ వేగంగా వెళ్లే రైల్లో సిఎం కెసిఆర్(పిక్చర్స్)

షాంగై/హైదరాబాద్: తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు చైనా కంపెనీలు ముందుకు వస్తున్నాయి. చైనా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావును కలుస్తున్న పలు ప్రముఖ కంపెనీల అధిపతులు, ప్రతినిధులు తమ ఆసక్తిని తెలియజేస్తున్నారు. షాంఘై పర్యటనలో భాగంగా గురువారం సాయంత్రం తెలంగాణ ప్రభుత్వం, సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో చైనాకు చెందిన 65మంది పారిశ్రామికవేత్తలనుద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించారు.

తెలంగాణ పారిశ్రామిక విధానం, పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సీఎం కేసీఆర్ వారికి వివరించారు. కాగా, 40 బిలియన్‌ డాలర్ల విలువైన షాంఘై ఎలక్ట్రిక్‌ కార్పొరేషన్‌ హైదరాబాద్‌లో హైపవర్డ్‌ పంపుల తయారీ, సరఫరా విభాగాలను ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని సీఎం కేసీఆర్‌ ఆహ్వానించగా పలు కంపెనీలు ఆసక్తి కనబరిచాయి.

హైదరాబాద్‌లో ఎల్‌ఈడీ టీవీల తయారీ కేంద్రానికి సంబంధించి ముఖ్యమంత్రి సమక్షంలో ఒప్పందం కుదిరింది. హైదరాబాద్‌లో సంస్థను నెలకొల్పేందుకు ముందుకు వచ్చిన షాంఘై ఎలక్ట్రిక్‌ కార్పొరేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ షావో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. వారిని తెలంగాణకు రావాలని ముఖ్యమంత్రి ఆహ్వానించారు.

తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన పారిశ్రామిక విధానంపై ముఖ్యమంత్రి అక్కడి సంస్థలకు వివరించారు. సింగిల్‌విండో పారిశ్రామిక విధానం అమలు చేస్తున్నట్లు తెలిపారు. అవసరమైనంత భూమి కోసం ఏర్పాటుచేసిన ల్యాండ్‌ బ్యాంక్‌, ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు లేకుండా ఉచితంగా అనుమతులు ఇస్తున్న తీరు, అవినీతి రహితమైన విధానాల గురించి సీఎం తెలియజేశారు.

హైస్పీడు రైలులో ప్రయాణించిన సిఎం కెసిఆర్

గంటకు 300కి.మీ వేగంగా నడిచే రైలు

గంటకు 300కి.మీ వేగంగా నడిచే రైలు

తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు చైనా కంపెనీలు ముందుకు వస్తున్నాయి.

వేగంగా నడిచే రైలులో సిఎం కెసిఆర్

వేగంగా నడిచే రైలులో సిఎం కెసిఆర్

చైనా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావును కలుస్తున్న పలు ప్రముఖ కంపెనీల అధిపతులు, ప్రతినిధులు తమ ఆసక్తిని తెలియజేస్తున్నారు.

సిఐఐ మీటింగ్

సిఐఐ మీటింగ్

షాంఘై పర్యటనలో భాగంగా గురువారం సాయంత్రం తెలంగాణ ప్రభుత్వం, సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో చైనాకు చెందిన 65మంది పారిశ్రామికవేత్తలనుద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించారు.

పారిశ్రామికవేత్తలు

పారిశ్రామికవేత్తలు

తెలంగాణ పారిశ్రామిక విధానం, పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సీఎం కేసీఆర్ వారికి వివరించారు.

ఒప్పందం

ఒప్పందం

గా, 40 బిలియన్‌ డాలర్ల విలువైన షాంఘై ఎలక్ట్రిక్‌ కార్పొరేషన్‌ హైదరాబాద్‌లో హైపవర్డ్‌ పంపుల తయారీ, సరఫరా విభాగాలను ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని సీఎం కేసీఆర్‌ ఆహ్వానించగా పలు కంపెనీలు ఆసక్తి కనబరిచాయి.

సిఐఐ మీటింగ్‌లో కెసిఆర్

సిఐఐ మీటింగ్‌లో కెసిఆర్

హైదరాబాద్‌లో ఎల్‌ఈడీ టీవీల తయారీ కేంద్రానికి సంబంధించి ముఖ్యమంత్రి సమక్షంలో ఒప్పందం కుదిరింది.

సిఐఐ మీటింగ్‌లో కెసిఆర్

సిఐఐ మీటింగ్‌లో కెసిఆర్

హైదరాబాద్‌లో సంస్థను నెలకొల్పేందుకు ముందుకు వచ్చిన షాంఘై ఎలక్ట్రిక్‌ కార్పొరేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ షావో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. వారిని తెలంగాణకు రావాలని ముఖ్యమంత్రి ఆహ్వానించారు.

సిఐఐ మీటింగ్‌లో కెసిఆర్

సిఐఐ మీటింగ్‌లో కెసిఆర్

తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన పారిశ్రామిక విధానంపై ముఖ్యమంత్రి అక్కడి సంస్థలకు వివరించారు. సింగిల్‌విండో పారిశ్రామిక విధానం అమలు చేస్తున్నట్లు తెలిపారు.

పారిశ్రామికవేత్తలు

పారిశ్రామికవేత్తలు

అవసరమైనంత భూమి కోసం ఏర్పాటుచేసిన ల్యాండ్‌ బ్యాంక్‌, ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు లేకుండా ఉచితంగా అనుమతులు ఇస్తున్న తీరు, అవినీతి రహితమైన విధానాల గురించి సీఎం తెలియజేశారు.

పారిశ్రామిక వేత్తలతో కెసిఆర్

పారిశ్రామిక వేత్తలతో కెసిఆర్

దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లో అనుమతి ఇచ్చేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఛేజింగ్‌ సెల్‌ గురించి ప్రత్యేకంగా వివరించారు.

పారిశ్రామిక వేత్తలతో కెసిఆర్

పారిశ్రామిక వేత్తలతో కెసిఆర్

తెలంగాణలో పట్టణాభివృద్ధి ప్రాజెక్టులు, వ్యర్థాలను విద్యుత్‌గా మార్చే ప్రాజెక్టులు, సాగునీటి ప్రాజెక్టులకు తోడ్పాటును అందించాలని న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకును ముఖ్యమంత్రి కోరారు.

పారిశ్రామిక వేత్తలతో కెసిఆర్

పారిశ్రామిక వేత్తలతో కెసిఆర్

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు దోహదపడేందుకు షాంఘై కేంద్రంగా ఏర్పాటైన ఈ బ్యాంకు ప్రెసిండెంట్‌ కె.వి.కామత్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ జియాన్‌ ఝూతో ముఖ్యమంత్రి సమావేశమై వివిధ అంశాలు చర్చించారు.

పారిశ్రామిక వేత్తలతో కెసిఆర్

పారిశ్రామిక వేత్తలతో కెసిఆర్

సుమారు 40 నిమిషాల పాటు జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి వినతిపై బ్యాంకు సానుకూలంగా స్పందించింది.

చైనాలో అతిపెద్ద నగరం, ప్రపంచ ఆర్థిక హబ్‌గా ఉన్న షాంఘైలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ బృందం గురువారం హైస్పీడ్‌ రైలులో ప్రయాణించింది. 300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రైలులో విమానాశ్రయం నుంచి షాంఘై నగరానికి చేరుకున్నారు. పారిశ్రామిక వేత్తలతో సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ బృందం వారికి తెలంగాణ ప్రభుత్వం తరఫున ప్రత్యేక విందును ఏర్పాటు చేసింది.

ఎల్‌ఈడీ తయారీ కేంద్రం ఒప్పందంహైదరాబాద్‌లో 20 మిలియన్‌ డాలర్ల పెట్టుబడితో ఎల్‌ఈడీ టీవీల తయారీ కేంద్రం ఏర్పాటుకు సంబంధించి సెల్‌కాన్‌, మెకెనో సంస్థలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్నాయి. అలాగే సెల్‌ఫోన్‌ విడిభాగాలు, హెడ్‌ఫోన్‌లు తయారు చేసే మరో 2 సంస్థలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+