వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గిన్నిస్ బుక్ రికార్డ్స్ లోకి కీసర తహసీల్దార్ ?.. అవినీతిలో ఆయనే టాప్... మ్యాటర్ ఏంటంటే

|
Google Oneindia TeluguNews

అవినీతి అన్న పదానికి పర్యాయపదం ఏదైనా ఉంటే అది కీసర తహసీల్దార్ బాలరాజు నాగరాజు అన్న చందంగా మారింది పరిస్థితి. ఇటీవల ఒక కోటి పది లక్షల రూపాయల భారీ లంచం తీసుకుని,అవినీతి నిరోధక శాఖకు అడ్డంగా దొరికిన కీసర తహసిల్దార్ పేరును గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కించాలని అవినీతి నిరోధక సంస్థలు దరఖాస్తు చేశాయంటే కీసర తహసీల్దార్ ఘనత ఎంతో అర్థం చేసుకోవచ్చు.

శ్రీశైలం అగ్నిప్రమాదంలో కొత్త కోణం .. అర్దరాత్రి సమయంలో బ్యాటరీల మార్పుపై అనుమానాలు శ్రీశైలం అగ్నిప్రమాదంలో కొత్త కోణం .. అర్దరాత్రి సమయంలో బ్యాటరీల మార్పుపై అనుమానాలు

ప్రపంచంలోనే భారీగా లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కీసర తహసీల్దార్

ప్రపంచంలోనే భారీగా లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కీసర తహసీల్దార్

అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రెండు స్వచ్ఛంద సంస్థలు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు లోకి అవినీతి చేస్తూ అత్యధికంగా లంచం తీసుకుంటూ పట్టుబడిన కీసర తహసీల్దార్ పేరును ఎక్కించాలని కోరాయి. ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇంత భారీగా లంచం తీసుకొని పట్టుబడడం ప్రపంచంలోనే ఇదే తొలిసారి అయ్యి ఉండొచ్చని అభిప్రాయపడుతున్న నేపథ్యంలోనే తమ దరఖాస్తులను పరిశీలించి కీసర తహసీల్దార్ పేరును గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కించాలని కోరారు.

 సీఎం కేసీఆర్ వార్నింగ్ ఇచ్చినా .. రెవెన్యూలో అవినీతిపరులకు కొదువ లేదని నిరూపిస్తున్న ఘటనలు

సీఎం కేసీఆర్ వార్నింగ్ ఇచ్చినా .. రెవెన్యూలో అవినీతిపరులకు కొదువ లేదని నిరూపిస్తున్న ఘటనలు

గతంలో సీఎం కేసీఆర్ రెవెన్యూ శాఖలో ప్రక్షాళన చేయాలని తీవ్రంగానే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంలో రెవెన్యూ ఉద్యోగులంతా అవినీతిపరులు కాదని రెవెన్యూ శాఖ అధికారులు తమ వాదనను గట్టిగా వినిపించారు. అనేక సందర్భాల్లో రెవెన్యూ అధికారుల తీరుతో విసిగి పోయిన రైతులు, ప్రజలు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నం చేశారు. తహసిల్దార్ విజయా రెడ్డి సజీవ దహనం తరువాత రెవిన్యూ శాఖ పై వరుసగా ఆరోపణలు వెల్లువెత్తాయి. అయినప్పటికీ రెవెన్యూ అధికారుల తీరులో మార్పు లేదు అని చెప్పడానికి కీసర తహసీల్దార్ అవినీతి వ్యవహారమే ఒక ఉదాహరణ .

కీసర తహసీల్దార్ నాగరాజు పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కించాలని ఆన్లైన్ దరఖాస్తు

కీసర తహసీల్దార్ నాగరాజు పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కించాలని ఆన్లైన్ దరఖాస్తు

ఇటువంటి సమయంలోనే ప్రభుత్వానికి కనువిప్పు కావాలని, ప్రపంచంలోనే ఎక్కువ అవినీతిపరులు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ ఉందని, రెవెన్యూ శాఖలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని తెలియజేస్తూ కీసర తహసీల్దార్ బాలరాజు నాగరాజు పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కించాలని అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రెండు స్వచ్ఛంద సంస్థలు గిన్నిస్ బుక్ నిర్వాహకులను కోరాయి.
ఒక ప్రభుత్వ ఉద్యోగి పట్టా విషయంలో రెండు కోట్ల రూపాయల డీల్ మాట్లాడుకుని , ఒక కోటి పది లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడటంపై యూత్ ఫర్ యాంటీ కరప్షన్ , జ్వాలా సంస్థ నిర్వాహకులు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కు ఆన్లైన్లో దరఖాస్తు చేశారు.

 ఆ కేటగిరీ లేదు .. పరిశీలిస్తామన్న గిన్నిస్ బుక్ నిర్వాహకులు

ఆ కేటగిరీ లేదు .. పరిశీలిస్తామన్న గిన్నిస్ బుక్ నిర్వాహకులు

వీరి దరఖాస్తులను పరిశీలించిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నిర్వాహకులు ఇప్పటివరకు ప్రభుత్వ అధికారుల అవినీతికి సంబంధించిన కేటగిరి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో లేదని ,దీనికోసం ప్రత్యేకంగా కేటగిరి ప్రారంభించే విషయాన్ని తాము పరిశీలిస్తున్నామని వారు తెలిపారు. మొత్తానికి గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించేంత పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ అధికారులలో అవినీతిపరులు ఉన్నారని తాజా ఉదంతంతో అందరికీ అర్థమవుతుంది. ఇలాంటి వారిపై ఉక్కు పాదం మోపి, అవినీతి రహిత సమాజాన్ని నిర్మించవలసిన బాధ్యత ఇటు ప్రభుత్వం పైన, అటు ప్రజల పైన ఉంది అని చెప్పడం నిర్వివాదాంశం.

English summary
Two anti-corruption NGOs have demanded that the Guinness Book of World Records name Keesara Tehsildar, who was caught taking the highest bribe for corruption. Keesara Tehsildar's name has been asked to be entered in the Guinness Book of Records in the wake of the allegations that this may be the first time in the world that a government employee has been caught taking such a hefty bribe.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X