ప్రేమజంటను అదుపులోకి తీసుకున్న కేరళ పోలీసులు
ఖమ్మం: సొంత రాష్ట్రం నుంచి పారిపోయి వచ్చి జిల్లాలోని అశ్వారావుపేటలో స్థానికంగా నివాసం ఉంటున్న కేరళకు చెందిన ప్రేమజంటను ఆ రాష్ట్ర పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. స్థానిక పోలీసుల సహకారంతో వీరిని కేరళకు తరలించారు.
వివరాల్లోకి వెళితే.. కేరళ రాష్ట్రం తాలిగఢ్‌కు చెందిన ప్రేమజంట సైరాభాను, జోష్‌లు నెలన్నర క్రితం అశ్వారావుపేట వచ్చి ఓ ప్రైవేట్ పాఠశాలలో పని చేస్తున్నారు. సైరాభాను తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేరళ పోలీసులు కొద్ది రోజుల క్రితం మిస్సింగ్ కేసు నమోదు చేశారు.

దర్యాప్తు చేపట్టిన కేరళ పోలీసులు అశ్వారావుపేటలో ఉన్నట్లు గుర్తించి యువతి సోదరుడు సజీర్, బాబాయ్ అబ్దుల్లాను తీసుకుని కేరళ సీనియర్ సివిల్ పోలీస్ ఆఫీసర్లు రాజీవ్, మోహనన్, ఏఎస్సై ఎంఏ జలీల్‌లు స్థానిక పోలీస్ స్టేషన్‌ను చేరుకున్నారు.
కేసు వివరాలు తెలిపి దర్యాప్తుకు సహాకారం కావాలని కోరారు. దీంతో ఏఎస్సైలు మోషే, శ్రీనివాసరావులు కేరళ పోలీసుల వెంట ప్రేమజంట నివాసం ఉంటున్న ఇంటికి వెళ్ళారు. అక్కడ ప్రేమజంటను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. స్టేషన్‌లో వివరాలు అందజేసి ప్రత్యేక వాహనంలో ప్రేమ జంటను కేరళకు తరలించారు.












Click it and Unblock the Notifications