అక్క కూతురితో చనువు వల్లే: ఇదీ అరుణ్ హత్య మిస్టరీ..

అతని అక్క కూతురితో అరుణ్‌కు ఉన్న సాన్నిహిత్యం సహించలేకనే హత్య చేసినట్లు నిర్దారించారు.

ముషీరాబాద్: హిమాయత్‌నగర్‌లోని జేఎక్స్‌ ప్లెక్సీ ప్రింటింగ్‌ ప్రెస్‌ మేనేజర్‌ అరుణ్‌ జార్జి (38) హత్య మిస్టరీ వీడింది. అరుణ్ జార్జిని హత్య చేసింది ఓ ఏఎస్ఐ అని పోలీసులు గుర్తించారు. అతని అక్క కూతురితో అరుణ్‌కు ఉన్న సాన్నిహిత్యం సహించలేకనే హత్య చేసినట్లు నిర్దారించారు.

సదరు ఏఎస్ఐ పూర్తి వివరాలు తెలియరానప్పటికీ.. రైల్వే పోలీస్ శాఖలో ఏఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నట్లు గుర్తించారు. హత్య జరిగిన రోజు రాత్రి అరుణ్ ఇంటికి ఏఎస్ఐ వెళ్లి గొడవ పడ్డట్టుగా చెబుతున్నారు.

ఏఎస్ఐ అక్క కుమార్తె అదే ప్రెస్ లో పనిచేస్తుండటంతో అరుణ్ ఆమెతో చనువుగా మెదులుతున్నట్లు తెలుస్తోంది. ఆమె భర్త దుబాయ్‌లో ఉంటున్నాడు. అరుణ్ ఆమెతో చనువుగా ఉండటం సహించలేక ఏఎస్ఐ పలుమార్లు అతన్ని హెచ్చరించాడు. అయినా అరుణ్ పద్దతి మార్చుకోకపోవడంతో అతనిపై కక్ష పెంచుకున్నాడు.

keralite arun george murder mystery chased by police

శనివారం రాత్రి ఇదే విషయంపై అడిగేందుకు ఏఎస్‌ఐ రాంనగర్‌లోని అరుణ్‌ ఇంటికి వెళ్లాడు. అప్పటికే అరుణ్‌ మద్యం మత్తులో ఉండటంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి తీవ్ర వాగ్వాదం జరిగింది. అది కాస్త ఘర్షణకు దారితీయడంతో ఏఎస్ఐ అరుణ్‌ను హత్య చేశాడు. అరుణ్ ఇంట్లోని బాత్రూంలో పోలీసులు అతని మృతదేహాన్ని గుర్తించారు.

ప్రస్తుతం నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు రెండు రోజుల్లో కోర్టు ముందు ప్రవేశపెట్టే అవకాశముంది. అరుణ్ జార్జి కేరళలోని కరిమన్నూర్ ప్రాంతానికి చెందినవాడిగా తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+