పిచ్చోన్ని అనుకున్నరా?.. అన్ని సరిచూసుకున్నాకే భూమి కొన్నాం: భగ్గుమన్న కేకే

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: మియాపూర్ భూకుంభకోణంలో గోల్డ్ స్టోన్ ప్రసాద్ అనే భూబకాసురుడి ఉదంతం బయటికి వచ్చిన తర్వాత అనేక సంచలనాలు నమోదవుతున్నాయి. ఇందులో భాగంగానే ఇబ్రహీంపట్నం సమీపంలోని ప్రభుత్వ భూములను గోల్డ్ స్టోన్ సంస్థ టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు కుటుంబం పేరిట రిజిస్టర్ అయినట్లు తేలడం మరింత సంచలనం రేపుతోంది.

కెసిఆర్‌కు చిక్కులు: భూస్కాంతో నమస్తే తెలంగాణ సిఈవోకు లింక్?

కాగా, కేశవరావు మాత్రం తమ కుటుంబంపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నారు. ఇబ్రహీంపట్నంలో 2013లో భూమి కొన్నది నిజమేనని, అయితే.. వివాదంలో ఉన్న భూములను మాత్రం కొనలేదని టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కే. కేశవరావు స్పష్టం చేశారు. శనివారం దీనిపై స్పందించిన ఆయన.. తాము కొనుగోలు చేసింది ప్రభుత్వ భూమి కాదని సీసీఎల్‌ఏ స్పష్టం చేసిందని, కోర్టు ఆదేశాలతోనే భూమి రిజిస్ట్రేషన్ జరిగిందని ఆయన పేర్కొన్నారు.

keshav rao condemns allegations of land scam in ibrahimpatnam

అలాగే తాము కొన్న భూమి రిజిస్ట్రేషన్‌ చేయాలని కలెక్టర్‌ కూడా ఉత్తర్వులు ఇచ్చారని, కలెక్టర్‌ ఉత్తర్వులు తప్పయితే కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశముంటుందని ఆయన అన్నారు. తాము కొనుగులు చేసిన భూమి గవర్నమెంటు పరిధిలోనిది కాదని, దీని కొనుగోలు న్యాయబద్దమేనని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు.

భూకుంభకోణంలో ఇరుక్కున్న కెకె ఫ్యామిలీ: కబ్జా భూమిలో కూతురి పేరిట రిజిస్ట్రేషన్స్!?

భూముల రిజిస్ట్రేషన్ కు సబ్ రిజిస్ట్రార్ అంగీకరించకపోతే హైకోర్టు ఆశ్రయించామని, కోర్టు సైతం అందుకు ఆమోదం తెలిపిందని కెకె అంటున్నారు. ఒకానొక సమయంలో సహనం కోల్పోయిన కెకె.. నేనేమైనా పిచ్చోన్ని అనుకున్నరా? లేక చదువు రాదనుకున్నరా? అంటూ ఫైర్ అయ్యారు. అన్ని వివరాలు సరిచూసుకున్న తర్వాతే భూ కొనుగోలు చేసినట్లు తెలిపారు. తానూ లా చదువుకున్నానని, తనకు అన్ని వివరాలు తెలుసునని చెప్పుకొచ్చారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
TRS Rajyasbha member K.Keshav Rao condemned the allegations of land scam. He said 'we bought that land after verifying all the details'
Please Wait while comments are loading...