phone tapping caseలో కీలక పరిణామం.. ఎన్నికలవేళ హైకోర్టు మెట్లెక్కిన బీఆర్ఎస్
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ కేసులో గత ప్రభుత్వ ప్రోద్బలం ఉందని, గత ప్రభుత్వ హయాంలోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కొంతకాలంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ ఫోన్ ట్యాపింగ్ వెనుక కేటీఆర్ ఉన్నారని పెద్ద ఎత్తున ప్రచారం కాగా, కేటీఆర్ ఆ వ్యాఖ్యలను ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో సంబంధం ఉందని వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ మంత్రులకు, నేతలకు నోటీసులు పంపారు. మీడియాలో దీనిపై వార్తలు ప్రసారం చేసిన వారిపై కూడా సీరియస్ అయిన కేటీఆర్ వారికి సైతం నోటీసులు పంపారు. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తాజాగా బీఆర్ఎస్ పార్టీ హై కోర్టును ఆశ్రయించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పిటీషన్ లో కోరింది.

ఎన్నికల కమీషన్ పట్టించుకోలేదని ఆరోపణ
ఎన్నికల సమయంలో కావాలని తమ పార్టీపై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని, లోక్సభ ఎన్నికల వేళ ఉద్దేశపూర్వకంగానే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెరమీదకు తెచ్చి పార్టీ శ్రేణులలో అభద్రతాభావాన్ని కలిగించడం ద్వారా, ఎన్నికలలో లబ్ది పొందాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ ఎన్నికల కమిషన్ కు సైతం ఫిర్యాదు చేశారు. అయితే ఎన్నికల కమిషన్ పట్టించుకోని కారణంగా తాము హైకోర్టును ఆశ్రయించినట్టు బిఆర్ఎస్ తరపున దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు.
కోర్టుకు బీఆర్ఎస్ విజ్ఞప్తి
బీఆర్ఎస్ పార్టీపై జరుగుతున్న అసత్య ప్రచారం ఆగేలా హైకోర్టు చర్యలు తీసుకోవాలని, ఈ విధంగా అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలను తీసుకోవాలని బీఆర్ఎస్ హైకోర్టు ధర్మాసనానికి దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొంది. గత బి ఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రతిపక్ష పార్టీల నేతలను, వ్యాపారవేత్తలను, సెలబ్రిటీలను టార్గెట్ చేసి తద్వారా రాజకీయంగాను, ఆర్థికంగాను బిఆర్ఎస్ లబ్ధి పొందిందని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ .. విచారణలో కీలక విషయాలు
ఈ మేరకు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన వారిపై కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారంలో ఉన్న పోలీసు ఉన్నతాధికారులను ఇప్పటికే అరెస్టు చేసి విచారణ చేస్తున్న పోలీసు అధికారుల బృందం ఈ కేసులో కీలక అంశాలను గుర్తించింది. రాష్ట్రవ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు, ఇందులో పలువురు బీఆర్ఎస్ పార్టీ నేతల పాత్ర కూడా ఉన్నట్టు గుర్తించింది.
కోర్టులో బీఆర్ఎస్ పిటీషన్ పై ఆసక్తి
దీనిపై మరింత లోతుగా దర్యాప్తు జరుపుతున్న క్రమంలో తాజాగా బి ఆర్ ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించి, తమ పార్టీపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆపాలని కోరింది. మరి హైకోర్టులో బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్ ను ధర్మాసనం స్వీకరిస్తున్నదా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications