బీజేపీ కోర్ కమిటీ కీలక భేటీ.. చర్చలో కీలకాంశాలివే!!
తెలంగాణ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో బిజెపి రాష్ట్రంలో అధికారి బిఆర్ఎస్ పై పోరాటం కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని నిర్ణయించింది. ఒకపక్క బీఆర్ఎస్ పార్టీ అడుగడుగున బిజెపికి చెక్ పెట్టడానికి కొత్త వ్యూహంతో అడుగులు వేస్తున్న వేళ, బిజెపి దాడిని తట్టుకొని ప్రజాక్షేత్రంలో, ప్రజల మద్దతును కూడగట్టడం కోసం బిజెపి కూడా మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని భావిస్తుంది.
ఇక ఇదే సమయంలో రేపు ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్న నేపథ్యంలో, ప్రధాని పర్యటనను గ్రాండ్ సక్సెస్ చేయాలని బిజెపి శ్రేణులు భావిస్తున్నాయి.ఈ క్రమంలో రేపు ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన తెలంగాణ రాష్ట్రంలో సాగనున్న వేళ బిజెపి రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర కోర్ కమిటీ సమావేశం జరుగుతుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో కోర్ కమిటీ సమావేశం జరుగుతుంది. రాష్ట్రంలో తాజా పరిస్థితుల పైన, ప్రధాని నరేంద్ర మోడీ సభను విజయవంతం చేయడానికి అనుసరించాల్సిన విధానాలపైన, జన సమీకరణకు సంబంధించిన అంశాల పైన చర్చ జరుగుతుంది.

అలాగే బండి సంజయ్ అరెస్ట్, ఆయన జైలుకు తరలింపు, బండి సంజయ్ బెయిల్, తదనంతర పరిణామాలను గురించి సీరియస్ గా కోర్ కమిటీ మీటింగ్ లో చర్చిస్తున్నారు. ముందు ముందు ఇదే విధమైన పరిణామాలను చూడాల్సి వస్తుందని, అందరూ ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలని కీలక నేతలు చెప్తున్నారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలు, అధికార బిఆర్ఎస్ పార్టీని ధీటుగా ఎదుర్కోవడానికి అనుసరించాల్సిన వ్యూహంపై కోర్ కమిటీ భేటీలో ప్రధానంగా చర్చ జరుగుతున్నట్టు సమాచారం. ఇక ఈ సమావేశంలో ఈటల రాజేందర్, డీకే అరుణ , రఘునందన్ రావు, జితేందర్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొంటున్నారు.
రేపు ప్రధాని నరేంద్ర మోడీ రాక నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బొగ్గు గనుల ప్రైవేటీకరణకు నిరసనగా ఆందోళనలకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో, బీఆర్ఎస్ వ్యూహాన్ని ఏ విధంగా తిప్పి కొట్టాలి అన్నదాని పైన కూడా ప్రధానంగా బిజెపి నేతలు చర్చిస్తున్నారు. అంతేకాదు ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ గతంలో రామగుండంలో పర్యటించిన సందర్భంలో బొగ్గు గనులను ప్రైవేటీకరించబోమని చెప్పారని, మళ్లీ అదే విషయాన్ని ప్రస్తుతం కూడా పునరుద్ఘాటించాలని బీజేపీ నాయకులు చర్చిస్తున్నట్లుగా సమాచారం.












Click it and Unblock the Notifications