గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ మహా గణపతి: భక్తజన కోలాహలం, ట్యాంక్‍బండ్ జనసంద్రం

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లోనేగాక దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జన శోభాయాత్ర.. భక్త జన సందోహం మధ్య ఘనంగా ముగిసింది. ప్రతి ఏడాది ఒక్కో ప్రత్యేక రూపంలో దర్శనమిచ్చే గణనాథుడు.. ఈ ఏడాది శ్రీ పంచముఖ లక్ష్మీ మహా గణపతి రూపంలో కనువిందు చేశాడు. కుడివైపున శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్యస్వామి, ఎడమవైపున శ్రీ త్రిశక్తి మహా గాయత్రీదేవి భక్తులకు దర్శనమిచ్చారు.

ఖైరతాబాద్ మహాగణపతి.. తరలివచ్చిన భక్తజనం

ప్లాస్టర్ ఆఫ్​ ప్యారిస్​ స్థానంలో శిల్పి రాజేందర్ నేతృత్వంలో ఈసారి రూపొందించిన 50 అడుగుల మట్టి విగ్రహం విశేషంగా ఆకట్టుకుంది. ఏటా 40 టన్నుల బరువులోపే ఉండే మహా గణపతి.. మట్టితో తయారు చేయడం వల్ల ఈసారి 70 టన్నులకు పెరిగింది. తొమ్మిది రోజులు కూడా లక్షల్లో భక్తులు సందర్శించారు.

ఉదయమే ప్రారంభమైన శోభయాత్ర..

కాగా, గణపయ్యను గంగమ్మ ఒడికి చేర్చేందుకు గురువారం అర్ధరాత్రి నుంచే ఏర్పాట్లు చేశారు. 70 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పుతో ఉన్న 26 టైర్ల ప్రత్యేక వాహనంపైకి మహాగణనాథుడి విగ్రహాన్ని ఎక్కించారు. కదలకుండా ఉండేందుకు వెల్డింగ్ పనులు చేపట్టారు. మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్​ మండపం వద్ద పూజలు చేశారు. అనంతరం శోభాయాత్ర శుక్రవారం ఉదయం ప్రారంభమైంది.

గణపతిబప్పా.. మోరయా అంటూ భక్తజనం

ఖైరతాబాద్​ నుంచి ఎన్టీఆర్​ మార్గ్​ వరకు.. దారిపొడువునా భక్తుల కోలాహలం మధ్య మహా గణపతి శోభాయాత్ర సాగింది. గణపతి బప్పా మోరియా నినాదాలతో పరిసర ప్రాంతాలు మారుమోగాయి. ఖైరతాబాద్​ గణనాథుడిని చూసేందుకు జనం వేలాదిగా తరలివచ్చారు. మహా గణపతి విగ్రహాన్ని కనులారా తిలకించి.. ఆనందపరవశులయ్యారు.

జనసంద్రమైన ట్యాంక్‍బండ్.. గంగమ్మఒడికి మహా గణపతి

ట్యాంక్ బండ్ వద్ద జనం కిక్కిరిసిపోయారు. ఎన్టీఆర్ మార్గ్ క్రేన్ నంబర్ 4 వద్ద ఖైరతాబాద్ మహా గణనాథుడి నిమజ్జనం చేశారు. వెళ్లిరా గణపయ్య.. మళ్లీ రావయ్యా అంటూ గణేశుడిని భక్తులు సాగనంపారు. మహా గణపతి ప్రశాంతంగా గంగమ్మ ఒడికి చేరడంతో.. పోలీసులు, జీహెచ్ఎంసీ సహా వివిధ విభాగాల అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు, శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు. బాలాపూర్ గణపతి సహా నగరంలో కొలువుదీరిన అనేక గణనాథులు ఈరోజు నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. శనివారం కూడా నిమజ్జనాలు కొనసాగనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+