ఈ ఏడాది సప్తముఖ గణేశుడి రూపంలో ఖైర‌తాబాద్ వినాయ‌కుడు..

మ‌రికొద్ది రోజుల్లో వినాయ‌క‌చ‌వితి ప్రారంభం కానుంది. తెలంగాణ‌లో వినాయ‌క‌చ‌వితి ఉత్స‌వాల‌కు ఎంతో ప్ర‌త్యేకత ఉంది. ఈ ఉత్స‌వాల్లో భాగంగా హైద‌రాబాద్ న‌గ‌రంలోని ఎంతో ఫేమ‌స్ అయిన ఖైర‌తాబాద్ వినాయ‌కుడి విగ్ర‌హ తయారీ ప‌నులు ప్రారంభ‌మ‌య్యాయి. ఈ విగ్ర‌హానికి ఎంతో ప్రాముఖ్య‌త ఉంది. కేవ‌లం ఖైర‌తాబాద్ వినాయ‌కుడిని చూసేందుకే చాలా మంది ఇక్క‌డికి వ‌స్తుంటారు. గ‌త సంవ‌త్స‌రం ఖైర‌తాబాద్ వినాయ‌కుడు రికార్డులు సృష్టించిన సంగ‌తి తెలిసిందే.

ఇక‌, ఈ ఏడాది త‌న రికార్డులు బ‌ద్ద‌లుకొట్టేందుకు స‌న్న‌ద్ద‌మ‌వుతున్నాడు. ఈసారి స‌ప్త‌ముఖ గ‌ణేశుడి రూపంలో ఖైరాతాబాద్ వినాయ‌కుడు ముస్తాబ‌వుతున్నాడు. ఈ ఏడాది కొలువుదీర‌నున్న ఈ గ‌ణేశుడికి ఎంతో ప్ర‌త్యేకత ఉంది. ఎందుకంటే 70 వసంతాలు పూర్తి చేసుకున్నత‌రుణంలో 70 అడుగుల ఎత్తులో ఈ వినాయ‌కున్ని ముస్తాబు చేయ‌నున్నారు. ఈ ఏడాది కొలువుదీరే గణేశుని ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం పదండి..

Khairatabad Vinayaka in the form of seven-faced Ganesha this year

ఇక్కడి గ‌ణనాథుడికి చాలామంది అభిమానులు ఉంటారు. ఒక్క తెలంగాణ నుంచే కాకుండా చాలా ప్రాంతాల నుంచి కూడా ఈ వినాయ‌కున్ని చూసేందుకు వ‌స్తుంటారు. ఖైరతాబాద్ గ‌ణ‌నాథుడు రికార్డ్‌లకు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలుస్తున్నాడు. ఇక‌, ఈసారి కూడా అడుగుల‌తో తన పేరు మీదున్న రికార్డును బ‌ద్ద‌లుకొట్టేందుకు సిద్ధమవుతున్నాడు. 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ వినాయ‌కుని విగ్ర‌హాన్ని 70 అడుగుల ఎత్తులో సిద్ధం చేస్తున్నారు.

ఈ సారి సప్తముఖ గణేశుడి రూపంలో ఖైర‌తాబాద్ వినాయకుడు దర్శనమివ్వబోతున్నాడు. ఈ విగ్ర‌హాన్ని పూర్తిగా మట్టితో నిర్మించ‌నున్నారు. ఈ విగ్ర‌హాన్ని త‌యారుచేసేందుకు సుమారు కోటి రూపాయల దాకా ఖ‌ర్చ‌వుతుంద‌ట‌.. ఈ ఖైరతాబాద్ వినాయ‌కుడికి ఇరువైపులా శివపార్వతులు ఉండ‌గా, శ్రీనివాసుల కల్యాణ మండపం కూడా నిర్మించ‌నున్నారు. ఇక‌, ప్రత్యేక ఆకర్షణగా అయోధ్య బాలరాముడి విగ్రహం కూడా ఇందులో త‌యారుచేస్తున్నార‌ట‌.

ఏడు ద‌శాబ్దాల చ‌రిత్ర‌..

ఇక్క‌డి వినాయ‌కుడికి దాదాపు ఏడు దశాబ్దాల చరిత్ర ఉంది. 1954లో సింగరి శంకరయ్య అనే ఓ భక్తుడు ఇక్క‌డి ఆలయంలో ఒక అడుగు ఎత్తున్న గణ‌నాథుని విగ్రహాన్ని ప్రతిష్టించి ప్ర‌త్యేక పూజలు చేశారు. అలా ప్ర‌తి సంవ‌త్స‌రం 2014 వరకు ఒక్కో అడుగు ఎత్తు పెంచుతూ వినాయ‌కుని విగ్రహాన్ని తయారు చేశారు. 2019లో 61 అడుగుల ఎత్తున్న వినాయ‌కుడి విగ్ర‌హాన్ని త‌యారుచేశాడు. అదే అప్ప‌డు ఇండియాలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా రికార్డులకెక్కింది.

అప్పటినుంచి విగ్రహం ఎత్తును త‌గ్గిస్తూ వ‌స్తున్నారు. అంతేకాదు, ఫారిస్‌ విగ్రహానికి స్వ‌స్థి ప‌లికి, మట్టి వినాయ‌కుని విగ్ర‌హం త‌యారు చేయ‌డం మొద‌లుపెట్టారు. ఈ నేప‌థ్యంలోనే 2023 పూర్తి మట్టితో 63 అడుగుల అత్యంత ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గ‌త ఏడాది త‌యారుచేసిన ఆ విగ్ర‌హం ప్రపంచ రికార్డ్ నెల‌కొల్పింది. గత సంవత్సరం కంటే ఈ సారి 7 అడుగులు ఎక్కువ ఎత్తుతో కమిటీ నిర్వహకులు ఖైర‌తాబాద్ వినాయ‌కుని విగ్ర‌హాన్ని నిర్మిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+