తన భార్యను కిడ్నాప్ చేశారంటూ వ్యక్తి ఫిర్యాదు: మంత్రి కుమారుడిపై కేసు నమోదు
హైదరాబాద్: రాష్ట్ర వాణిజ్యపన్నులు, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కుమారుడు సాయి కిరణ్ వివాదంలో చిక్కుకున్నాడు. తన భార్యను కిడ్నాప్ చేశారని అభినవ్ అనే వ్యక్తి మారేడ్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో మంత్రి కుమారుడితో పాటు మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సికిందరాబాద్ మారేడ్‌పల్లికి చెందిన ఓ యువతిని అభినవ్ ప్రేమించి రెండు నెలల క్రితం పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత తన భార్యను ఆమె తల్లిదండ్రులు బలవంతంగా తీసుకెళ్లినట్లు అభినవ్ తన ఫిర్యాదులో ఆరోపించారు.

భార్యను ఇంటికి తీసుకొచ్చుకునేందుకు వెళ్లిన అభినవ్‌పై ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు దాడి చేశారు. అయితే తన భార్య కిడ్నాప్, దాడి వెనుక మంత్రి తలసాని కుమారుడి హస్తముందని అభినవ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ధృవీకరించిన డిసిపి
ప్రేమించి పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్న తన భార్యని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయికిరణ్ తన మిత్రులతోకల్సి కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడని బాధితుడు అభినవ్ మహేందర్ మారేడ్‌పల్లి పోలీసులకు ఫిర్యాదుచేశారు.
ఇదే అంశంపైన నార్త్ జోన్ డిసిపి ప్రకాష్ బోయిన్‌పల్లి నందమూరినగర్‌లో కార్డన్‌సెర్చ్‌లో ఉన్న సమయంలో మీడియా వివరాలు అడగగా.. కేసు నమోదైన విషయం వాస్తవమని వివరాలు శనివారం వెల్లడిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications