ప్రయాణీకుడి సమాచారంతో నవ్యశ్రీ క్షేమంగా ..మతిస్థిమితం లేకే కిడ్నాప్?
తిరుమలలో కిడ్నాప్ కు గురైన నాలుగేళ్ళ చిన్నారి నవ్యశ్రీ మహబూబ్ నగర్ పోలీసుల వద్ద సురక్షితంగా ఉంది. కిడ్నాపర్ ను పోలీసులు అరెస్టు చేశారు.
మిడ్జిల్:తిరుమలలో కిడ్నాప్ కు గురైన నాలుగేళ్ళ చిన్నారి నవ్యశ్రీ మహబూబ్ నగర్ పోలీసుల వద్ద సురక్షితంగా ఉంది. కిడ్నాపర్ ను పోలీసులు అరెస్టు చేశారు.
అనంతపురం జిల్లా కనగానిపల్లె మండలంలోని తగరకుంటకు చెందిన మహంత, ఆయన సతీమణి వరలక్ష్మి, కొడుకు హర్ష, కూతురు నవ్యశ్రీ తిరుపతికి ఆదివారం నాడు వచ్చారు. తిరుపతిలో శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకొన్న తర్వాత ఆలయ ఆవరణలోనే నిద్రిస్తున్నారు.
అయితే ఆదివారం రాత్రి పూట నవ్యశ్రీని రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం అంతారానికి చెందిన వడ్డే బాలస్వామి నవ్యశ్రీని కిడ్నాప్ చేశారు.

జడ్చర్ల మీదుగా బస్సులో నాగర్ కర్నూల్ కు బస్సులో నవ్యశ్రీని తరలిస్తుండగా పోలీసులు పట్టుకొన్నారు. చిన్నారి నవ్యశ్రీని పోలీసులు తమ వద్దే ఉంచుకొన్నారు.
జడ్చర్ల నుండి బాలస్వామి తన స్వగ్రామానికి వెళ్తుండగా ఓ ప్రయాణీకుడు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కిడ్నాపర్ ను అరెస్టు చేశారు.
బాలస్వామి కూర్చోన్న వెనుక సీటులోనే దేవరకొండకు చెందిన యాదయ్య బస్సులో ప్రయాణీస్తున్నాడు. అయితే నవ్యశ్రీ పదే పదే తన తల్లి గురించి బాలస్వామిని ప్రశ్నించి ఏడ్చింది.దీంతో యాదయ్యకు అనుమానం వచ్చింది.
బస్సులోనే బాలస్వామిని యాదయ్య ప్రశ్నించాడు. తన కూతురే అంటూ బాలస్వామి బుకాయించాడు. అనుమానంతో యాదయ్య పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
మిడ్జిల్ వద్దకు రాగానే బస్సును ఆపి పోలీసులు నవ్యశ్రీని ,కిడ్నాపర్ బాలస్వామిని అదుపులోకి తీసుకొన్నారు.అయితే అమ్మ చనిపోయిందని కిడ్నాప్ చేసి తీసుకొచ్చాడని బాలిక పోలీసులకు వివరించింది. అయితే చిన్నారిని పెంచుకొనేందుకు తీసుకువచ్చినట్టు కిడ్నాపర్ బాలస్వామి చెప్పాడు.
నవ్యశ్రీ తగరకుంటలోని రోహిత్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో ఎల్ కె జి చదువుతోంది. మరో వైపు నిందితుడు బాలస్వామికి మతిస్థిమితం లేకపోవడంతో బాలస్వామి తల్లిదండ్రులు చనిపోయారు. దీంతో భార్య వదిలేసింది.
గ్రామంలో కట్టెలు కొట్టి వచ్చిన డబ్బులతో దేవస్థానాలు తిరుగుతాడు. అయితే పాపను బాలస్వామి ఎందుకు కిడ్నాప్ చేశాడో తెలియదని గ్రామస్థులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications