వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్నేహితుడే కిడ్నాపర్, మూడు గంటల్లోనే నిందితుడి అరెస్టు

ఇంజనీరింగ్ విధ్యార్థిని కిడ్నాప్ చేసిన నిందితుడిని పోలీసులు మూడు గంటల్లో అరెస్టు చేశారు. స్నేహితుడే ఆమెను కిడ్నాప్ చేసి ఆమె తల్లిదండ్రులను ముప్పె లక్షల రూపాయాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ :ఇంజనీరింగ్ విధ్యార్థినిని కిడ్నాప్ చేసి ముప్పై లక్షల డిమాండ్ చేసిన నిందితుడిని పోలీసులు మూడు గంటల్లో అరెస్టు చేశారు. నిందితుడు విధ్యార్థిని స్నేహితుడే. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించిన ఈ కేసును చేధించారు.

హైద్రాబాద్ లోని షాహినాయత్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బేగంబజార్ బేదర్ వాడికి చెందిన విధ్యార్థినిని శాలిబండకు చెందిన అభిషేక్ అనే విధ్యార్థి కిడ్నాప్ చేశాడు. వీరిద్దరూ కూడ బండ్లగూడలోని మహవీర్ ఇంజనీరింగ్ కాలేజ్ లో బిటెక్ రెండో సంవత్సరం చదువుతున్నారు.

సోమవారం ఉదయం కాలేజీకి వెళ్ళిన విధ్యార్థిని రాత్రి పదిగంటలు దాటిని ఇంటికి రాలేదు. అయితే దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. అదే సమయంలో విధ్యార్థిని ఫోన్ నుండి తల్లిదండ్రులకు ఫోన్ వచ్చింది.

kindapper arrested in hyderabad

మీ అమ్మాయిని కిడ్నాప్ చేశానని, వెంటనే ముప్పై లక్షల రూపాయాలను ఇవ్వాలని లేకపోతే ఆమెను చంపేస్తానని కిడ్నాపర్ బెదిరించాడు. ఈ విషయాన్ని కాలేజీలో కాని, పోలీస్ స్టేషన్ లో కాని పిర్యాదు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు కిడ్నాపర్.

ఈ ఫోన్ కాల్ తో అప్రమత్తమైన విధ్యార్థిని తల్లిదండ్రులు షాహినాయత్ గంజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సమాచారాన్ని నగర పోలీస్ కమీషనర్ కు చేరవేశారు పోలీసులు.

kindapper arrested in hyderabad

రాత్రి పదకొండు గంటల సమయంలో షాహినాయత్ గంజ్ పోలీస్ స్టేషన్ కు వచ్చి మహేందర్ రెడ్డి దర్యాప్తును పర్యవేక్షించారు. పోలీసులు మూడు గంటల పాటు శ్రమించి కిడ్నాపర్ ను అరెస్టు చేశారు.

సికింద్రాబాద్ , మెహిదీపట్నం , చార్మినార్ ప్రాంతాల్లో మూడు గంటల్లో తన మకాన్ని మార్చాడు కిడ్నాపర్. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు నిందితుడు కిడ్నాపర్ అరెస్టు చేశాడు. విధ్యార్థినిని కిడ్నాప్ చేసింది ఆమె స్నేహితుడే.

English summary
engeneering student kidnap case traced within three hours hyderabad police. abhishek kidnap his friend demanding her parents 30 lakhs. police arrest abhishek.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X