నిజాం: కేసీఆర్‌పై కిషన్ ఫైర్, మజ్లిస్‌తో దోస్తీపై నాయిని
హైదరాబాద్: అరాచక పాలన అందించిన నిజాం రాజును తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పొగడటం ఆయన దివాలాకోరుతనానికి అద్దం నిదర్శనమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి శనివారం మండిపడ్డారు. ముస్లిం సోదరుల ఓటు బ్యాంకు కోసమే నిజాంను చంద్రశేఖర రావు పొగుడుతున్నారన్నారు.
నిజాంను పొగిడి, స్వాతంత్య్రసమర యోధులను కేసీఆర్ అవమానిస్తున్నారన్నారు. నిజాం అరాచక పాలనను కేసీఆర్ ఎందుకు సమర్ధిస్తున్నారో చెప్పాలన్నారు. ఒక ముఖ్యమంత్రి అయి ఉండి ఇలా ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడటం తగదన్నారు.

చాకలి ఐలమ్మ, కొమరం భీం తదితరులు ఎవరి పైన పోరాడారో చెప్పాలన్నారు. నిజాం అరాచక పాలన పైన పోరాడిన వారికి కేంద్రం, రాష్ట్రం పింఛన్ ఇస్తుందని, దానిని తొలగిస్తారా చెప్పాలని సవాల్ విసిరారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా ఈ నెల 7వ తేదీ సాయంత్రం హైదరాబాద్‌కు వస్తారని చెప్పారు. 8వ తేదీన ఆయన పార్టీ ముఖ్యనేతలతో భేటీ అవుతారన్నారు.
కొమురం భీంను నిజాం చంపలేదు: నాయిని
కొమురం భీంను నిజాం చంపలేదని, నిజాం పాలనలో జరిగిన మంచిని కూడా చెప్పవద్దా అని హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి ప్రశ్నించారు. కమ్యూనిస్టులకు తిండి పెట్టారని తమ నాన్నను కూడా చంపారని, టీడీపీ నేతలు దిక్కుతోచక పిచ్చుకూతలు కూస్తున్నారని ధఅవజమెత్తారు. నిజాం గురించి కేసీఆర్ చెప్పింది వాస్తవమే అన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలియదని, తాము ఎన్నికల్లో మజ్లిస్ పార్టీతో దోస్తీ చేస్తున్నామన్నది వాస్తవం కాదన్నారు. తాను, మంత్రి ఈటెల రాజేందర్ మజ్లిస్ నేత అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఇంటికి వెళ్లామని, ప్రభుత్వానికి సహకరించాలని కోరామన్నారు.












Click it and Unblock the Notifications