వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘కేసీఆర్ మోసపూరిత హామీలకు కొదవ లేదు’: కేటీఆర్‌కు కిషన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పించిన తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రధాని మోడీకి విజన్ కొరత కారణంగానే దేశంలో అనేక సమస్యలు అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించగా.. రాష్ట్రంలో కేసీఆర్ పాలనతో ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని, ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ట్విట్టర్ వేదికగా ఎదురుదాడి చేశారు.

టీఆర్ఎస్ పాలనలో హామీల అమలేది?: కిషన్ రెడ్డి

టీఆర్ఎస్ పాలనలో హామీల అమలేది?: కిషన్ రెడ్డి

'టీఆర్ఎస్ పాలనలో
"ఇంటికో ఉద్యోగం లేదు"
"నిరుద్యోగ భృతి లేదు"
"ఉచిత ఎరువులు లేదు"
"ఋణమాఫీ లేదు"
"దళిత ముఖ్యమంత్రి లేదు"
"దళితులకు మూడెకరాల భూమి లేదు"
"పంటనష్ట పరిహారం లేదు"
"దళితబందు లేదు"
"బిసిబందు అసలే లేదు"
"ధాన్యం కొనుగోలు కేంద్రాల ఊసు లేదు"
"డబుల్ బెడ్ రూమ్ జాడ లేదు"' అంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. మంత్రి కేటీఆర్‌కు కౌంటర్ ఇచ్చారు.

కేసీఆర్ మోసపూరిత హామీలకు కొదవ లేదంటూ కిషన్ రెడ్డి ఫైర్

కేసీఆర్ మోసపూరిత హామీలకు కొదవ లేదంటూ కిషన్ రెడ్డి ఫైర్

'"అప్పులకు కొదవ లేదు"
"కొత్త రేషన్ కార్డుల ఊసు లేదు"
"కొత్త పెన్షన్ కార్డుల జాడ లేదు"
"సామాజిక న్యాయం లేదు"
"సచివాలయం లేదు"
"సీఎం ప్రజలను కలిసేది లేదు"
"ఉద్యమ కారులకు గౌరవం లేదు"
"విమోచన దినోత్సవం జరిపేది లేదు"
.
.
.
.
.

ఇలా చెప్పుకుంటూ పోతే "కేసీఆర్ మోసపూరిత హామీలకు కొదవ లేదు"'

మోడీకి విజన్ కొరత అంటూ కేటీఆర్ ట్వీటేశారు


కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీపై టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రతిరోజు కేంద్ర ప్రభుత్వ విధానాలపై మంత్రి కేటీఆర్.. సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, బొగ్గు కొరత సమస్యపై ఈ తెలంగాణ మంత్రి స్పందించారు. బీజేపీ పాలనలో బొగ్గు, ఆక్సిజన్, ఉద్యోగాలు, కరెంట్, ఉపాధి, నిధులకు కొరత ఏర్పడిందని కేటీఆర్ విమర్శలకు గుప్పించారు. 'బీజేపీ పాలనలో బొగ్గు కొరత, కరోనా టైంలో ఆక్సిజన్ కొరత, పరిశ్రమలకు కరెంట్ కొరత, యువతకు ఉద్యోగాల కొరత, రాష్ట్రాలకిచ్చే నిధుల కొరత.. అన్ని సమస్యలకు మూలం ప్రధాని నరేంద్ర 'మోడీకి విజన్ కొరత' అని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఎన్పీఏ గవర్నమెంట్ ఎమేజింగ్ పర్ఫమెన్స్ అంటూ ఎద్దేవా చేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

English summary
Union Minister kishan reddy counter tweet to ktr's tweet on pm modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X