మహిళపైనా దాడులా? ప్రజాస్వామ్యం ఉందా?: కేసీఆర్ సర్కారుపై కిషన్ రెడ్డి నిప్పులు

భైంసా: తెలంగాణ సీఎం కేసీఆర్ సర్కారుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌కు గవర్నర్ మీ గౌరవం ఉండదు.. రాజకీయ పార్టీలు, ఎన్నికైన ప్రజాప్రతినిధులపై గౌరవం ఉండదు.. ప్రధానమంత్రికి కనీస మర్యాద ఇవ్వరు.. యాత్రను అడ్డుకుంటారు, అక్రమ కేసులు పెడతారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా భైంసాలో జరిగిన బహిరంగ సభలో కిషన్ రెడ్డి మాట్లాడారు.

ఆడబిడ్డ అని చూడకుండా అంటూ కిషన్ రెడ్డి ఫైర్

ఆడబిడ్డ అని చూడకుండా అంటూ కిషన్ రెడ్డి ఫైర్

తెలంగాణలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, ఈ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేద్దామని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. అవసరమైతే జైలుకు వెళ్లడానికైనా తాము సిద్దమేనన్నారు. బీజేపీ నాయకులకు మీ జైళ్లు సరిపోవని కేసీఆర్ సర్కారుకు సవాల్ విసిరారు. మాట తప్పం.. మడమ తిప్పం అని వ్యాఖ్యానించారు. ఆడబిడ్డ అని చూడకుండా పోలీసులు అడ్డుకున్నారన్నారని షర్మిలపై దాడిని ప్రస్తావించారు. పోలీసుల ముందు టీఆర్ఎస్ నాయకులు పెట్రోల్ పోసి తగలబెట్టే పరిస్థితి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేశంలో ఎక్కడలేనివిధంగా కేసీఆర్ దుర్మార్గపు పాలన: కిషన్ రెడ్డి

దేశంలో ఎక్కడలేనివిధంగా కేసీఆర్ దుర్మార్గపు పాలన: కిషన్ రెడ్డి

అసలు ఈ తెలంగాణలో శాంతి, భద్రతలున్నాయా.. ఈ పోలీసులు శాంతి, భద్రతల కోసం ఉన్నారా? లేక ప్రతిపక్షాలను అణిచివేయడం కోసం ఉన్నారా? అని నిలదీశారు కిషన్ రెడ్డి. ఇంతటి దుర్మార్గం ఎప్పుడూ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసీఆర్ తెలంగాణను ఎటు తీసుకపోతున్నారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ తెలంగాణలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని, ఈ రోజు రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా, మద్యం తెలంగాణాగా మార్చేశారని మండిపడ్డారు. కేసీఆర్‌కు ప్రధాని మీద, గవర్నర్ మీద, ఉద్యమాల మీద గౌరవముండదని విమర్శించారు. పోలీసులను టీఆర్ఎస్ ఏజెంట్ల లాగా వాడుకుంటున్నారన మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తున్న పార్టీలను పోలీసులు అణచివేసే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

కేసీఆర్ పతనం ప్రారంభమైందన్న కిషన్ రెడ్డి

తెలంగాణలో కేసీఆర్ పతనం ప్రారంభమైందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఒక్కసీటు రాదని జోస్యం చెప్పారు. మోడీ వస్తే ఫామ్ హౌస్‌లో దాక్కునే కేసీఆర్.. ప్రధానిని గద్దె దించుతాడనడం హాస్యాస్పదమన్నారు. వెయ్యి మంది కేసీఆర్‌లు, ఓవైసీలు వచ్చినా, వెయ్యి బీఆర్ఎస్ పార్టీలు పెట్టినా మూడవ సారీ ప్రధాని మోడీనే అవుతారని కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే కేసీఆర్ కుటుంబం భరతం పట్టి, అక్రమాస్తులను పేదలకు పంచి పెడుతామన్నారు కిషన్ రెడ్డి. దళితబంధు ఈటెల రాజేందర్ వల్లే వచ్చిందని, లబ్ధిదారులు ఈటల, మోడీ ఫొటోలు పెట్టుకోవాలని చెప్పారు. బీఆర్ఎస్ పేరుతో వైఫల్యాలపై ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు ప్రజలు దీవించి అండగా ఉండాలని కిషన్ రెడ్డి కోరారు. కేసీఆర్ ఇచ్చిన మాట ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదని మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+