జనగామ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర ఆగస్ట్ 19 నుండి , పాల్గొననున్న బండి సంజయ్ ; షెడ్యూల్ ఇదే !!

|
Google Oneindia TeluguNews

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగస్టు 19వ తేదీ నుంచి జన ఆశీర్వాద యాత్రను ప్రారంభించనున్నారు. కొత్తగా కేంద్రంలో మంత్రులుగా ఎంపికైనవారు ప్రజల్లో పట్టు సంపాదించి, బీజేపీని క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్ళేలా చూడాలని బిజెపి కేంద్ర పెద్దలు నిర్ణయించడంతో ఒక్కో కేంద్రమంత్రి కనీసం నాలుగు లోక్సభ నియోజకవర్గాల్లో పర్యటించే విధంగా ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో జన ఆశీర్వాద యాత్రను నిర్వహించనున్నారు.

గంగుల కమలాకర్ కు ఈడీ షాక్ .. హుజురాబాద్ ఉపఎన్నిక సమయంలో బండి సంజయ్ దెబ్బగంగుల కమలాకర్ కు ఈడీ షాక్ .. హుజురాబాద్ ఉపఎన్నిక సమయంలో బండి సంజయ్ దెబ్బ

 కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర .. బండి సంజయ్ యాత్ర అందుకే పోస్ట్ పోన్

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర .. బండి సంజయ్ యాత్ర అందుకే పోస్ట్ పోన్

తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్రంలో 2024 టార్గెట్ గా, బీజేపీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఆగస్టు 24వ తేదీ నుంచి పాదయాత్రను నిర్వహించనున్నారు. బండి సంజయ్ నిర్వహించే పాదయాత్రకు ప్రజా సంగ్రామ యాత్రగా పేరు పెట్టారు. ఇక తాజాగా ఆగస్టు 19 వ తేదీ నుండి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో, బీజేపీ ఎంపీలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉన్న క్రమంలో బండి సంజయ్ పాదయాత్రను ఆగస్టు 24వ తేదీకి పోస్ట్ పోన్ చేసుకున్నారు.

ఆగస్టు 19వ తేదీ నుండి కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర... కోదాడలో ప్రారంభం

ఆగస్టు 19వ తేదీ నుండి కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర... కోదాడలో ప్రారంభం

మొదట ఆగస్టు 16వ తేదీ నుండి కిషన్ రెడ్డి పాదయాత్ర కొనసాగుతుందని భావించినా ప్రస్తుతం ఆగస్టు 19వ తేదీ నుండి కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్రను నిర్వహించనున్నట్లుగా తెలుస్తుంది. కోదాడ నుండి హైదరాబాద్ వరకు జన ఆశీర్వాద యాత్ర కొనసాగనుంది. ఇక కిషన్ రెడ్డి నిర్వహించే జన ఆశీర్వాద యాత్ర వివరాల్లోకి వెళితే ఆగస్టు 19 వ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు కోదాడలో జన ఆశీర్వాద యాత్ర ప్రారంభమై, మరుసటి రోజు 20వ తేదీన దంతాలపల్లి, తొర్రూరు, రాయపర్తి, వర్ధన్నపేట, మీదుగా వరంగల్ చేరుకుంటుంది. వరంగల్ లో భద్రకాళి అమ్మవారిని దర్శనం చేసుకొని, వరంగల్, హనుమకొండలో తెలంగాణ అమరవీరుల స్థూపాల వద్ద అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించి, వరంగల్ లో వ్యాక్సినేషన్ కేంద్రాలను సందర్శించి వ్యాక్సినేషన్ ఎలా సాగుతుందో పరిశీలిస్తారు.

 మూడు రోజుల పాటు సాగనున్న జన ఆశీర్వాద యాత్ర

మూడు రోజుల పాటు సాగనున్న జన ఆశీర్వాద యాత్ర

ఆపై జన ఆశీర్వాద యాత్ర ఖిలా షాపూర్ లో సర్వాయి పాపన్న గ్రామం నుండి జనగామ జిల్లా కు చేరుకుంటుంది.
ఆ తర్వాత ఆలేరు లో పద్మశ్రీ అవార్డు అందుకున్న చేనేత కళాకారులు చింతకింది మల్లేశం కుటుంబాన్ని పలకరించి, యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో దర్శనం చేసుకున్న తరువాత 20వ తారీకు రాత్రి యాదగిరిగుట్ట లోనే కిషన్ రెడ్డి బస చేస్తారు. ఇక 21వ తేదీ ఉదయం భువనగిరిలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ అందిస్తున్న ఉచిత బియ్యం పథకాన్ని పరిశీలించడానికి రేషన్ షాపులను సందర్శిస్తారు. అనంతరం ఘట్కేసర్, ఉప్పల్ మీదుగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం మీదుగా నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంటారు.

 12 జిల్లాల మీదుగా, ఏడు పార్లమెంటు నియోజకవర్గాలు,324 కి.మీ యాత్ర

12 జిల్లాల మీదుగా, ఏడు పార్లమెంటు నియోజకవర్గాలు,324 కి.మీ యాత్ర

21వ తేదీన రాత్రి 7 గంటలకు బిజెపి రాష్ట్ర కార్యాలయం వద్ద సభ నిర్వహిస్తారు.మొత్తం తెలంగాణ రాష్ట్రంలోని 12 జిల్లాల మీదుగా, ఏడు పార్లమెంటు నియోజకవర్గాలు, 17 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 324 కిలోమీటర్లు కిషన్ రెడ్డి నేతృత్వంలో జన ఆశీర్వాద యాత్ర కొనసాగుతుంది. ఈ యాత్రను సక్సెస్ చేయడానికి బిజెపి కార్యకర్తలు సమాయత్తమవుతున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పుంజుకోవడానికి ఒకపక్క కేంద్రమంత్రి, అధిష్టానం ఆదేశాల మేరకు పార్లమెంటు నియోజక వర్గాలలో పర్యటించి బీజేపీని క్షేత్రస్థాయిలో తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తే, మరోపక్క ప్రజా సంగ్రామ యాత్రతో టిఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతూ అధికార పార్టీ పై సమరానికి సై అంటున్నారు రాష్ట్ర రథ సారధి బండి సంజయ్. తెలంగాణలో బిజెపి పుంజుకోవడానికి యాత్రల బాట పడుతున్న బిజెపి నేతలు ఏమేరకు సక్సెస్ అవుతారు అనేది వేచి చూడాల్సిందే.

English summary
Union Minister Kishan Reddy will launch the Jana Ashirwad Yatra from August 19. With the BJP central leaders deciding that the newly elected ministers at the Center should gain a foothold among the people and take the BJP to the field level, each Union Minister has planned to tour almost four Lok Sabha constituencies. In this context, Union Minister Kishan Reddy organize a Jana Ashirwad Yatra in Telangana. The three-day trip will cover 12 districts, seven parliamentary constituencies and 324 km.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X