వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'డీఎస్సీ లేదని చెప్పిన సీఎం': మందకృష్ణపై టీఆర్ఎస్ దాడి యత్నం

By Srinivas
|
Google Oneindia TeluguNews

నల్గొండ: ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేయకుండా తెలంగాణ సీఎం కేసీఆర్ యుతను దగా చేస్తున్నారని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి బుధవారం నల్గొండ జిల్లాలో మండిపడ్డారు. ఆయన నిరుద్యోగ గర్జన సభలో మాట్లాడారు.

తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసింది యువతనే అన్నారు. సుమారు 1200 మంద విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకున్నారన్నారు. యవత త్యాగాల ఫలితంగానే తెలంగాణ వచ్చిందని, ఇప్పుడు వారిని నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు.

ఉద్యోగాలు కావాలని యువకులు అడిగితే మంత్రులు అవమానించేలా మాట్లాడుతున్నారన్నారు. డీఎస్సీ లేదని సీఎం, ఉప ముఖ్యమంత్రి ప్రకటిస్తున్నారని, మరి ఉద్యోగాలు కల్పిస్తామని గతంలో ఎలా ప్రకటించారని ప్రశ్నించారు. యువత పోరాటం చేస్తేనే ప్రభుత్వం దిగొచ్చే పరిస్థితి ఉందన్నారు.

Kishan Reddy

మోడీ ఏం చేశారంటే...

ఉద్యోగాల కల్పనకు ప్రధాని మోడీ చిత్తశుద్ధితో ఉన్నారని చెప్పారు. తెలంగాణలో నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంటు, గిరిజన, ఉద్యాన విశ్వవిద్యాలయాలను మంజూరు చేసిందన్నారు. పాలమూరు జిల్లాలో 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పాదనకు నిధులు కేటాయించిందన్నారు. నల్గొండలో ఫ్లోరోసిస్ పరిశోధన కేంద్రం ఏర్పాటుకు రూ.2,500 కేటాయించారన్నారు.

కాగా, అంతకుముందు బీజేపీ నేతలు మాట్లాడుతూ.. గోదావరి పుష్కరాలకు రూ.500 కోట్లు కేటాయిస్తానని చెప్పిన కేసీఆర్ రూ.50 కోట్లు కూడా కేటాయించలేదని, కేంద్రం రూ.50 కోట్లు ఇస్తోందని చెప్పారు.

మందకృష్ణపై దాడికి యత్నం

నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి శాసన సభ్యుడు రవీందర్ రెడ్డి స్వగ్రామంలో దళితుల భూముల విషయంలో అన్యాయం జరిగితే హైకోర్టును ఆశ్రయిస్తామని ఎమ్మార్పీస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. ఎమ్మెల్యే ఎర్రపహాడ్‌లో దళితుల భూమి ఆక్రమించారన్నారు.

మందకృష్ణ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమయంలో తిరిగి వెళ్తున్న సమయంలో ఎర్రహపాడ్‌కు చెందిన కొందరు టీఆర్ఎస్ వాళ్లు అడ్డుకోబోయారు.

దీంతో, ఎమ్మార్పీఎస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. కొంతమంది మందకృష్ణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మందకృష్ణ మాదిగపై దాడి అమానుషమని, టీఆర్ఎస్ కార్యకర్తలు ఉద్దేశ్యపూర్వకంగా దాడి చేశారని సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.

English summary
BJP Telangana chief Kishan Reddy question KCR on employment
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X