అధ్యక్ష పదవి రేసులో లేను: కిషన్ రెడ్డి, ట్యాంక్‌బండ్‌పై 'కాకా' విగ్రహం ఏర్పాటు!

హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి పైన.. ప్రస్తుత అధ్యక్షఖులు కిషన్ రెడ్డి బుధవారం నాడు పెదవి విప్పారు. శాసన సభ వాయిదా పడిన అనంతరం ఆయన మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు.

అధ్యక్ష పదవి రేసులో తాను లేనని చెప్పారు. జాతీయ పార్టీ పదవుల పైన కూడా తనకు ఎటువంటి ఆశక్తి లేదని చెప్పారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడం పైనే దృష్టి సారిస్తామని చెప్పారు. పార్టీ బలోపేతం కోసం తనవంతు కృషి చేస్తానన్నారు.

ప్రజా సమస్యల పైన మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు చాలా బాధాకరమన్నారు. అసెంబ్లీలో రైతు సమస్యల పైన చర్చ జరపాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Kishan Reddy says he is not in BJP chief race

‘కాకా' విగ్రహ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ

హైదరాబాదులోని ట్యాంక్‌బండ్ పైన కాంగ్రెస్ సీనియర్ నేత దివంగత జి వెంకటస్వామి విగ్రహం ఏర్పాటు కానుంది. ఈ మేరకు కాకా విగ్రహ ఏర్పాటుకు అనుమతినిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాగర్‌ పార్క్‌లో కాకా విగ్రహం ఏర్పాటు కానుంది.

వరంగల్ ఎన్‌కౌంటర్ బూటకం

కార్మికులు, ఉద్యమకారుల పైన తెలంగాణ ప్రభుత్వం అణచివేత ధోరణితో వ్యవహరిస్తోందని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. ఆశ వర్కర్లు డిమాండ్లు సరైనవేనని చెప్పారు.

ఆశా వర్కర్ల విషయంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. వరంగల్ ఎన్ కౌంటర్ బూటకమన్నారు. ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+