కేసీఆర్ కృష్ణా జలాలపై.. రేవంత్ రెడ్డి కాళేశ్వరంపై రచ్చ అందుకే: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి!!

కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నేడు వరంగల్ లో పర్యటించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జి. కిషన్​ రెడ్డి కాంగ్రెస్, బీఆర్ఎస్ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తే.. కాళేశ్వరంపై దర్యాప్తు చేయడానికి సీబీఐ సిద్ధంగా ఉందని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిందన్నారు.

బీఆర్​ఎస్​ నాయకులు అక్రమాలు, అవినీతికి పాల్పడినా గత సీఎం కేసీఆర్​.. సీబీఐ దర్యాప్తుకు ముందుకు రాలేదన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​ సీబీఐ దర్యాప్తు ఎందుకు కోరడం లేదో ముఖ్యమంత్రి చెప్పాలన్నారు. డ్యామ్​ కు సంబంధించిన నాణ్యత, ప్లానింగ్​, డిజైనింగ్​, ఎగ్జిక్యూషన్​ అక్రమాలను బయటపట్టడానికి విజిలెన్స్​ కు సామర్థ్యం ఉండదన్నారు.

kishan reddy slams revanth reddy kaleshwaram drama and kcr krishna water drama

బీఆర్​ఎస్​ అధికారంలో ఉన్నప్పుడు మేము వివరాలు కోరితే.. మాదగ్గర వివరాలు లేవు అని కొన్నే ఇచ్చింది. డ్యామ్​ సేఫ్టీ అథారిటీ దేశవ్యాప్తంగా ప్రాజెక్టుల రక్షణ చూస్తుందని, తాము గతంలో మేడిగడ్డ బ్యారేజ్ క్రుంగినప్పుడు కేంద్రానికి లేఖ రాస్తే డ్యామ్​ సేఫ్టీ అథారిటీ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి కమిటీ విచారణ జరిపిందన్నారు.

ప్రాజెక్ట్ సర్వే, ప్లానింగ్​, డిజైనింగ్​, నిర్మాణం, ఆపరేషన్​, నిర్వహణ అన్నీ లోపభూయిష్ఠంగా ఉన్నాయని, ప్రమాదకర పరిస్థితిలో డ్యామ్​ ఉన్నదని, నీటిని ఖాళీ చేయాలని డ్యామ్​ సేఫ్టీ అథారిటీ సూచించిందన్నారు కిషన్ రెడ్డి. డ్యామ్​ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మేము నాటి బీఆర్​ఎస్​ సర్కారుకు లేఖలు రాశామని, ఎన్నికల తర్వాత కాంగ్రెస్​ ప్రభుత్వానికి కూడా మేము లేఖలు రాసినా.. ఎలాంటి స్పందన లేదన్నారు.

ఉత్తరకుమారిడి మాటలు తప్ప కాంగ్రెస్​ చేతలు లేవని మండిపడ్డారు.ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్ష పార్టీ, పాలక పార్టీ కూడబలుక్కోని నాటకాలు ఆడుతున్నాయన్నారు. మేడిగడ్డ డ్యామేజీ వ్యవహారాన్ని పొలిటికల్​ మైలేజ్​ కోసం కాంగ్రెస్​ వాడుకుంటున్నదని మండిపడ్డారు.అసెంబ్లీ బంద్​ పెట్టి.. మేడిగడ్డకు ఎందుకు వెళ్తున్నారో అర్థం కావడం లేదు.

ఒకరు కృష్ణా జలాలపై, మరొకరు కాళేశ్వరంపై రచ్చ చేస్తూ ఎంపీ ఎన్నికల్లో లబ్ధిపొందాలని రెండు పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రజలను రెచ్చగొట్టి, నరేంద్ర మోదీ పట్ల జనంకు ఉన్న సానుకూల ధోరణిని డైవర్ట్​ చేసేందుకు బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ డ్రామాలు చేస్తున్నాయని మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+