హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణలో రూ. 1000 కోట్ల భారీ పెట్టుబడి: మంత్రి కేటీఆర్‌తో కైటెక్స్ ఎండీ, ప్రతినిధుల భేటీ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కేరళకు చెందిన ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ కైటెక్స్ గ్రూపు తెలంగాణలో టెక్స్ టైల్ రంగంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. శుక్రవారం ప్రగతి భవన్‌లో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో కైటెక్స్ కంపెనీ ప్రతినిధులు భేటీ అయ్యారు.

దాదాపు రూ. 1,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు కైటెక్స్ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలపై కైటెక్స్ గ్రూపు ఎండీ సాబు ఎం జాకబ్, ప్రతినిధుల బృందం మంత్రి కేటీఆర్‌తో చర్చించారు. వస్త్రాల తయారీలో పేరొందిన కైటెక్స్ సంస్థ.. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పరిశ్రమలను నిర్వహిస్తోంది.

Kitex MD and Team Meets minister KTR, to invest Rs 3500 cr in Textiles sector in telangana state

పారిశ్రామిక అనుకూల విధానలు, టెక్స్ టైల్ రంగంలో అపార అవకాశాలు ఉన్నందునే తెలంగాణను ఎంచుకున్నట్లు ఎండీ జాకబ్ తెలిపారు. ఈ పరిశ్రమ ఏర్పాటుతో దాదాపు 30వేల ఉద్యోగాలు లభించే అవకాశాలున్నాయన్నారు. కాగా, పారిశ్రామిక విధానాలు, జౌళి రంగంలో అవకాశాలను మంత్రి కేటీఆర్ వారికి వివరించారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, పరిశ్రమల శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ జయేశ్ రంజన్, హ్యాండ్లూమ్ టెక్స్‌టైల్స్ కమిషనర్ శైలజా రామయ్యర్, టీఎస్ఐఐసీ లిమిటెడ్ ఎండీ నర్సింహా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. కాగా, తెలంగాణలో ఇప్పటికే ఆమెజాన్ సహా అనేక సంస్థలు పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే.

కేరళలో ప్రభుత్వం నుంచి సరైన మద్దతు లభించకపోవడంతో అక్కడి రూ. 3500 కోట్ల ప్రాజెక్టును విరమించుకుని తెలంగాణలో కైటెక్స్ పెట్టుబడులు పెట్టడం గమనార్హం. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద పిల్లల వస్త్రాల తయారీ కంపెనీ కైటెక్స్ కావడం గమనార్హం.

English summary
Kitex MD and Team Meets minister KTR, to invest Rs 3500 cr in Textiles sector in telangana state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X