సీఎం వ్యూహాలు తెలిసిన వాడిని.!కేసిఆర్ మీద ప్రతీకారం తీర్చుకుంటా.!ఈటల సంచలన వ్యాఖ్యలు.!

హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పై హుజురాబాద్ బీజేపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. వాస్తవానికి చంద్రశేఖర్ రావు ధైర్యవంతుడు కాదని, ఎంత గట్టిగా మాట్లాడుతాడో అంత పిరికివాడని ఈటల రాజేందర్ స్పష్టం చేసారు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే నెట్టుకొస్తాడని, సమస్యలు తలెత్తితే పరిష్కరించే చాకచక్యం లేకపోగా పారిపోయే తత్వంగల వాడని పేర్కొన్నారు. రాజకీయంగా తెలంగాణలో సమ ఉజ్జీ ఎదురైతే ఖచ్చితంగా హాండ్స్ అప్ అంటాడని చంద్రశేఖర్ రావుపైన ఘాటు వ్యాఖ్యలు చేసారు ఈటల రాజేందర్.

 బీజేపి రాజకీయ ప్రళయం సృష్టిస్తుంది.. కేసీఆర్ తట్టుకోలేడన్న ఈటల

బీజేపి రాజకీయ ప్రళయం సృష్టిస్తుంది.. కేసీఆర్ తట్టుకోలేడన్న ఈటల

హుజూరాబాద్ గెలుపును పక్కదోవ పట్టించడం కోసం అనేక ఎత్తుగడలు వేశాడని ముఖ్యమంత్రి చంద్కశేఖర్ రావుపై తీవ్రంగా స్పందించారు ఈటల రాజేందర్.
హుజూరాబాద్ ప్రజలు కొట్టిన దెబ్బకు చంద్రశేఖర్ రావు వచ్చి ధర్నాచౌక్ లో పడ్డాడని, భూమి మీదకు దిగివచ్చాడని, ఫామ్ హౌజ్ నుండి బయటికి వచ్చాడని అన్నారు. అంతే కాకుండా ప్రగతిభవన్ చుట్టూ ఉన్న ఇనుప కంచెలు కూడా తొలగిపోవాలని స్పష్టం చేసారు. రాబోయే రోజుల్లో బీజేపీది ప్రళయం ఉంటుందని,దాన్ని చంద్రశేఖర్ రావు తట్టుకోలేడని అన్నారు.

 ఇటు పొడిచే సూర్యుడు అటు పొడిచినా కేసీఆర్ గెలవడు.. ప్రజల్లో అనూహ్య మార్పు వచ్చిందన్న ఈటల

ఇటు పొడిచే సూర్యుడు అటు పొడిచినా కేసీఆర్ గెలవడు.. ప్రజల్లో అనూహ్య మార్పు వచ్చిందన్న ఈటల

భారత గడ్డ మీద నియంతృత్వం, అహంకారం చెల్లదని దేశ ప్రజలు ఎమర్జెన్సీ సమయంలో వచ్చిన ఎన్నికల్లో చాటి చెప్పారని ఈటల రాజేందర్ గుర్తు చేసారు. మంత్రిగా ఉండి కూడా ధర్నా చేసిన వారికి మద్దతు తెలిపిన సందర్బాలు అనేకం ఉన్నాయన్నారు ఈటల. సంఘాలు ఉంటాయి, సమస్యల కోసం కొట్లాడితాయి అని తాను గతంలో చెప్పానని అన్నారు. చంద్రశేఖర్ రావు కాళ్ళు మొక్కితే అన్నీ తప్పులు ఒప్పు అవుతాయని ఎద్దేవా చేసారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇటు ఉన్న సూర్యుడు అటు పొడిసినా కూడా చంద్రశేఖర్ రావు గెలవడని, మొన్న వచ్చింది హుజూరాబాద్ తీర్పు కాదని, యావత్ తెలంగాణ ప్రజల ఆకాంక్ష ప్రస్పుటించిందని ఈటల అన్నారు.

 ఇక తెలంగాణలో కేసీఆర్ ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు.. ధాన్యం కొనుగోలు అంశంలో సీఎం పచ్చి అబద్దాలు

ఇక తెలంగాణలో కేసీఆర్ ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు.. ధాన్యం కొనుగోలు అంశంలో సీఎం పచ్చి అబద్దాలు

ఇదిలా ఉండగా మోదీ ప్రభుత్వం మీద ఒక్క అవినీతి ఆరోపణ లేదని, ఆకలి విలువ తెలిసిన వ్యక్తి ప్రధాని అయితే ఏం చేయోచ్చో చేసి చూపించిన గొప్ప వ్యక్తి ప్రధాని మోదీ అని ప్రశంసించారు. వరిధాన్యం కొనలేక చంద్రశేఖర్ రావు కేంద్రం మీద నెపం వేశారని, మోదీ రైతు చట్టాలను వెనక్కు తీసుకొని గొప్ప దార్శనికుడిగా నిలిపోయారని అన్నారు. రైస్ మిల్లులు పెట్టలేక పోయినందుకు చంద్రశేఖర్ రావు రెండు చెంపలు వేసుకోవాలని, బియ్యం కొనలేకపోయానని ఒప్పుకోవాలని నిలదీసారు. ధాన్యం కొనుగోలు అంశంలో చంద్రశేఖర్ రావు అబద్ధాలు ప్రజలకు అర్థం అయ్యాయని అన్నారు. ఇక తెలంగాణలో చంద్రశేఖర్ రావును ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని స్పష్టం చేసారు.

 రాబోవు రోజుల్లో తెలంగాణలో బీజేపీ ప్రభంజనం.. కేసీఆర్ కొట్టుకుపోక తప్పదన్న ఈటల

రాబోవు రోజుల్లో తెలంగాణలో బీజేపీ ప్రభంజనం.. కేసీఆర్ కొట్టుకుపోక తప్పదన్న ఈటల

అంతే కాకుండా ప్రజల కన్నీళ్లకు పరిష్కారం బీజేపీ అని, పవర్ కోసం కాకుండా ప్రజలకోసం బీజేపి వస్తుందని పేర్కొన్నారు. రాబోవు రోజుల్లో తెలంగాణలో బీజేపీ ప్రళయం, ప్రభంజనం ఉంటుందని, దాన్నిచంద్రశేఖర్ రావు తట్టుకోలేరని సంచలన వ్యాఖ్యలు చేసారు. మనం వేగం పెంచాలి అని నాయకులకు, కార్యకర్తలకు ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. అంతే కాకుండా ప్రజలే చరిత్ర నిర్మాతలని, అలా కాకపోతే కడు పేద కుటుంబం నుండి వచ్చిన నరేంద్ర మోడీ ప్రధాని అయ్యే వారు కాదని ఈటల తెలిపారు. ప్రజలు న్యాయం ధర్మం పాటించకపోతే తాను మళ్లీ ఎమ్మెల్యే అయ్యే వాడిని కాదుని అన్నారు. రంగారెడ్డి రూరల్ జిల్లా బీజేపీ శిక్షణా తరగతులకు ముఖ్య అతిథిగా హాజరైన ఈటల రాజేందర్ మాట్లాడారు. బీజేపి నేతలు వేగం పెంచాలని పిలుపునిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+