వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కళ్యాణ్‌పై బీజేపీ ఆగ్రహం, ఇద్దరికీ కోదండరాం దిమ్మతిరిగే చురకలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీపై విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తర్వాత బీజేపీ కూడా ఈ భేటీపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. జనసేనానిపై బీజేపీ నేత ఒకరు విరుచుకుపడ్డారు.

Recommended Video

Pawan & KCR's meeting : కేసీఆర్ - పవన్ భేటీ : 'తాట తీస్తా', 'ఆడి పేరేందిరా బై' !

పవన్‌ను బాగా చూసుకోండి: వారితో కేసీఆర్, సీఎం ఆఫర్‌కు నో చెప్పిన పవర్ స్టార్పవన్‌ను బాగా చూసుకోండి: వారితో కేసీఆర్, సీఎం ఆఫర్‌కు నో చెప్పిన పవర్ స్టార్

బీజేపీ అధికార ప్రతినిధి శ్రీధర్ రెడ్డి ఓ న్యూస్ ఛానల్‌తో మాట్లాడారు. జనసేన పేరును భజనసేనగా మార్చుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. ఏ మాత్రం అవగాహన లేకుండా పవన్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ను పొగడటం వపన్ అవగాహన లేమిని తెలియజేస్తోందన్నారు.

 భేటీపై విమర్శలు

భేటీపై విమర్శలు

కేసీఆర్ - పవన్ కళ్యాణ్ భేటీపై కాంగ్రెస్ నేతలు వి హనుమంత రావు, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, రేవంత్ రెడ్డి, తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం తదితరులు స్పందించారు. వీరంతా ఈ భేటీపై విమర్శలు గుప్పించారు.

 విహెచ్ కూడా తీవ్ర వ్యాఖ్యలు

విహెచ్ కూడా తీవ్ర వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీ నేత వి హనుమంత రావు తీవ్ర వ్యాఖ్యలే చేశారు. డ్రగ్స్ మాఫియాను రక్షించేందుకే కేసీఆర్‌తో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారని సంచలన వ్యాఖ్యలు చేశారు. డ్రగ్ పెడ్లర్ కెల్విన్‌పై ఛార్జీషీటు ఎందుకు వేయలేదో చెప్పాలని నిలదీశారు. పవన్‌కు దమ్ముంటే రైతుల వద్దకు రావాలని హితవు పలికారు.

 కోదండరాం తీవ్ర వ్యాఖ్యలు

కోదండరాం తీవ్ర వ్యాఖ్యలు

పవన్ కళ్యాణ్ - కేసీఆర్ భేటీపై కోదండరాం కూడా స్పందించారు. ఆయన తీవ్ర వ్యాఖ్యలే చేశారు. కలిసి ఉన్న మిత్రులు శత్రువులు అయ్యారు, శత్రువులేమో మిత్రులు అయ్యారని ఎద్దేవా చేశారు. ఒకరినొకరు తిట్టుకున్న వారిద్దరు కలిసిపోయారని వ్యాఖ్యానించారు.

 విపక్షాలతో పాటు

విపక్షాలతో పాటు

గతంలో తిట్టుకున్న వీరిద్దరు ఇప్పుడు కలుసుకోవడంతో రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. విపక్షాలే కాకుండా, ఈ అంశంపై వివాదాస్పద దర్శకులు రామ్ గోపాల్ వర్మ, నిత్యం పవన్ కళ్యాణ్‌ను విమర్శిస్తూ ఇమేజ్ పెంచుకోవాలని భావిస్తున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న కత్తి మహేష్‌లు కూడా స్పందించారు.

English summary
Telangana JAC chairman Kodandaram and BJP leader Sridhar Reddy on Jana sena chief Pawan Kalyan and Telangana Chief Minister KCR meet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X