మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్ సర్కారుపై పోరాటం ఆగదు: కోదండరాం

రైతులకు న్యాయం జరి గేంతవరకు ప్రభుత్వంపై తమ పోరాటం కొనసాగుతుందని కొదండరాం అన్నారు. మెదక్ జిల్లా పెద్దశంకరపేటలో స్థానిక గాంధీ చౌక్ వద్ద నిర్వహించిన అమరుల స్ఫూర్తి యాత్రలో పాల్గొని మాట్లాడారు.

|
Google Oneindia TeluguNews

మెదక్: రైతులకు న్యాయం జరి గేంతవరకు ప్రభుత్వంపై తమ పోరాటం కొనసాగుతుందని టిజెఎసి కన్వీనర్ ప్రొఫెసర్ కొదండరాం అన్నారు. గురువా రం మధ్యాహ్నం ఆయన మెదక్ జిల్లా పెద్దశంకరపేటలో స్థానిక గాంధీ చౌక్ వద్ద టిజెఎసి ఆధ్వర్యంలో నిర్వహించిన అమరుల స్ఫూర్తి యాత్రలో పాల్గొని మాట్లాడారు. రైతుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శిం చారు.

రైతుకు ఎకరాకు రూ.4వేలు ఇస్తామని ప్రకటించడం మంచిదే అయినా, పంట పండిన తర్వాత గిట్టుబాటు లేక పోవడంతో ఇచ్చిన 4వేలు కూడా వృథా అయ్యే అవకాశం ఉందన్నారు. ఈ పరిస్థితి పోవాలంటే రైతుకు ఎకరాకు రూ.4వేలతో పాటు మద్దతు ధర కూడా ఇవ్వాల్సిన అవస రం ఉందని అభిప్రాయపడ్డారు. గతంలో పత్తి పంట వేసు కుంటే గిట్టుబాటు లేదని, కందులు వేసుకోవాలని ప్రభుత్వ మే సూచించిందని, అందరూ కందులు వేసుకుంటే అ పం టకు సైతం గిట్టుబాటు లేకపోవడంతో అయినకాడికి అ మ్ముకునే దుస్థితి నెలకొందన్నారు.

Kodandaram fires at KCR for farmers issues

మద్దతు ధరతో పాటు నాణ్యమైన విత్తనాలనే ప్రభుత్వం సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. నిధులు, నియామకాలు, నీళ్లు పేరుతో అధి కారంలో వచ్చిన ప్రభుత్వం ఆ తర్వాత వీటి సంగతే మర్చి పోయిందన్నారు. రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ఇప్పటివరకు నోటిఫికేషన్లు వేయడం లేదన్నారు. రైతులకు రుణమాఫీ చేసినా వారి డబ్బులు ఇంకా వారి చేతికి చేరుకో లేదని, బ్యాంకులో ఎంత మాఫీ జమ చేశారో ఇప్పటికీ అంతుచిక్కని పరిస్థితి నెలకొందన్నారు.

బ్యాంకులో జమ అయినా ఇప్పటివరకు వారి డబ్బులు ఇవ్వడం లేదని, మరికొన్నిచోట్ల బ్యాంకు వాళ్లు వారి బకాయిల కింద జమ చేసు కుంటున్నారని ఆరోపించారు. రైతుకు ఖరీఫ్ పంట పెట్టుబడుల కోసం మళ్లీ వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరిగి రూ.5 వడ్డీ కోసం అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం చేస్తున్న వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండట్టేందుకు తాము ప్రయత్నిస్తున్నామని, రైతులకు సంపూర్ణ న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగు తుందని స్పష్టం చేశారు.

గొర్రెల పథకం కింద లబ్ధిదారుడి సబ్సిడీ కింద రు.30వేలు చెల్లించాల్సి ఉంటుందని, వారు ఎక్కడి నుంచి ఆ నిధులు తీసుకువస్తారని ఆయన విమర్శిం చారు. చాలామంది తమ భార్యల మెడల్లో నుంచి పుస్తెలు తాకట్టు పెట్టి తమవంతు వాటా చెల్లించారని ఆయన చెప్పారు. 20 గొర్రె పిల్లలను ఇచ్చారని, వాటిలో అన్నీ బతికితేనే గొర్రెల వారికి న్యాయం జరుగుతుందన్నారు. అమరుల స్ఫూర్తి యాత్రకు టిడిపి మండల నాయకులు పూర్తి సంఘీ భావం ప్రకటించారు. మండల కన్వీనర్ అలుగుల్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో సభ ఏర్పాట్లు పూర్తిచేశారు.

English summary
Telangana JAC Chairman Kodandaram on fired at CM K Chandrasekhar Rao for farmers issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X